Posani on Pawan Kalyan: అవకాశాల పేరుతో అమ్మాయిని మోసం చేస్తే.. మీరేం చేశారు..? పవన్ పై పోసాని వ్యాఖ్యలు
సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' సినిమా ఈవెంట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే.
సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' సినిమా ఈవెంట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. సినీ, రాజకీయ అంశాలపై పవన్ మాట్లాడారు. ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టడంతో పాటు సినీ పెద్దలను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను, కొందరు మంత్రులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.
Also Read: సింహంతో వేట.. నాతో ఆట రెండూ ప్రమాదమే.. నటరాజ్ మాస్టర్ ఫైర్!
ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు, వైసీపీ సపోర్టర్ పోసాని కృష్ణమురళి స్పందించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంతో తప్పు లేదని.. కానీ ఆధారాలు చూపించి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే బాగుంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష సరిగ్గా లేదని.. చిరంజీవి నోటి నుంచి ఏరోజైనా అమర్యాద పదాలు వచ్చాయా..? అని ప్రశ్నించారు.
'రిపబ్లిక్' సినిమా ఫంక్షన్ లో సీఎం, మంత్రులను తిట్టడం ఏంటని పోసాని నిలదీశారు. పవన్ కళ్యాణ్ రెండు నియోజక వర్గాల్లో ఉన్నారు.. రెండు చోట్ల తిరిగారు.. ఒక్కచోటైనా గెలవగలిగారా..? అని పోసాని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ తో పోల్చుకుని వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు. సీఎం జగన్ పనితీరుని దేశమంతా గుర్తించిందని అన్నారు. రెండేళ్లలో పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చేశారని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ఏంటో సినీ పరిశ్రమకు, ప్రపంచానికి బాగా తెలుసని వెటకారంగా అన్నారు. జగన్ తో అసలు పవన్ కి పోలికే లేదని మండిపడ్డారు. సీఎం జగన్ కు కులపిచ్చి ఉందని నిరూపించగలరా..? అని ప్రశ్నించారు. అవకాశాల పేరుతో పంజాబ్ అమ్మాయిని ఓ వ్యక్తి మోసం చేసి.. విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించినట్లు తెలిసింది. ఈ విషయం స్వయంగా విన్నానని పోసాని అన్నారు. బాధితురాలికి న్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం చేస్తే పవన్ కి గుడికడతానని చెప్పుకొచ్చారు.
Also Read: భర్తతో విడాకులు.. స్పందించిన శిల్పాశెట్టి..
Also Read: 'మీ వెనుక గొర్రెలు కాదుకదా.. వాటి బొచ్చు కూడా రాదు.. అడివి మీ అబ్బ సొత్తేమ్ కాదు'
Also Read: ఓటీటీలో 'భీమ్లా నాయక్'.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..
Also Read: పవన్ ‘మా’ సభ్యుడే.. ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు: ప్రకాష్ రాజ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి