News
News
వీడియోలు ఆటలు
X

Kondapolam Trailer: 'మీ వెనుక గొర్రెలు కాదుకదా.. వాటి బొచ్చు కూడా రాదు.. అడివి మీ అబ్బ సొత్తేమ్ కాదు'

'కొండపొలం' అనే నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ సినిమాను రూపొందించారు. దానికి కూడా 'కొండపొలం' అనే టైటిలే పెట్టారు.

FOLLOW US: 
Share:

'కొండపొలం' అనే నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ సినిమాను రూపొందించారు. దానికి కూడా 'కొండపొలం' అనే టైటిలే పెట్టారు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు అక్టోబర్ 8న సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 

Also Read: ఓటీటీలో 'భీమ్లా నాయక్'.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..

ఇంటర్వ్యూ కోసం వెళ్లిన హీరోని.. 'గొర్లె కాపరుల కుటుంబం.. తల్లితండ్రులకు చదువు లేదు. ఏ కోచింగ్ సెంటర్ లో ట్రైన్ అయ్యారు' అని ప్రశ్నించగా.. 'అడివి సర్.. నల్లమల్ల అడివి' అంటూ హీరో బదులిచ్చే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఈ క్రమంలో చూపించిన అడివి సన్నివేశాలు, పులి గాండ్రించే సీన్స్ ఆకట్టుకున్నాయి. మందల మందల గొర్రెలున్న హీరో ఫ్యామిలీ, గొర్రెలకు నీళ్లు లేక వాటి కోసం 'కొండపొలం' వెళ్లాలని నిర్ణయించుకుంటారు. తన తండ్రితో పాటు హీరో కూడా కొండపొలానికి వెళ్తాడు. 

'చదువుకున్న గొర్రె చదువుకోని గొర్రెతో మాటాడేది సూసినావా' అంటూ రకుల్.. హీరో గురించి చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది. 'మందని ఇడిసిపెట్టి పోతే.. ఇక్కడోలే నవ్వుతారు.. 'కొండపొలం' వదిలేసి ఇంటికి పారిపోతే.. ఊరంతా నవ్వుతాది.. నేను ఉంటా నాయనా' అంటూ హీరో అమాయకంగా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. 

అనంతరం గొర్రెలను చంపి తినే పులి, గొర్రెల వెంటపడే దొంగల ముఠాకి సంబంధించిన సన్నివేశాలను చూపించారు. 'మీ వెనుక గొర్రెలు కాదుకదా.. వాటి బొచ్చు కూడా రాదు.. అడివి మీ అబ్బ సొత్తేమ్ కాదు.. పోండీ' అంటూ హీరో ఇచ్చే వార్నింగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ చివర్లో గొర్రెని తినే పులిని హీరో ఆవేశంగా చూసే సీన్ మరో హైలైట్ అనే చెప్పాలి. మొత్తానికి విజువల్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు దర్శకుడు క్రిష్. మొత్తం టీజర్ ఒక ఎత్తయితే.. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read: 'మా'లో ఎన్నికల సందడి షురూ.. నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్ టీమ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 27 Sep 2021 04:00 PM (IST) Tags: rakul preet singh Vaishnav tej Krish Kondapolam movie Kondapolam trailer

సంబంధిత కథనాలు

Shubman Gill Orange Cap: ఈ సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ దాదాపు గిల్‌దే - మిగతా వారికి ఎంతో దూరంలో!

Shubman Gill Orange Cap: ఈ సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ దాదాపు గిల్‌దే - మిగతా వారికి ఎంతో దూరంలో!

Full Bottle Teaser : బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తా - 'ఫుల్ బాటిల్'లో సత్యదేవ్ చింపేశాడుగా 

Full Bottle Teaser : బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తా - 'ఫుల్ బాటిల్'లో సత్యదేవ్ చింపేశాడుగా 

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్లు - వీరి కాంబినేషన్‌ అస్సలు బోరుకొట్టదు!

ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్లు - వీరి కాంబినేషన్‌ అస్సలు బోరుకొట్టదు!

Miss Shetty Mr Polishetty - Dhanush : హతవిధీ - నవీన్ పోలిశెట్టికి ఛాన్స్ ఇవ్వని ధనుష్! 

Miss Shetty Mr Polishetty - Dhanush : హతవిధీ - నవీన్ పోలిశెట్టికి ఛాన్స్ ఇవ్వని ధనుష్! 

టాప్ స్టోరీస్

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

NTR centenary celebrations : తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !

NTR centenary celebrations :  తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !

Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ

Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ