అన్వేషించండి

AP Rains: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు - పొంగిపొర్లుతోన్న జలాశయాలు, ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటంటే?

Andhra News: ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి.

Over Flowing Reservoirs In Ap: ఏపీని భారీ వర్షాలు వీడడం లేదు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులైన ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలంలకు వరద పోటెత్తుతోంది. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు, అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని తాండవ జలాశయంలో (Thandava Resetvoir) నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అధికారులు ఇక్కడ రెండు గేట్లు ఎత్తి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 379 అడుగులుగా నమోదైంది. తాండవ జలాశయం వరద రహదారిపై పొంగి ప్రవహిస్తోన్న క్రమంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఉప్పరగూడెం - గన్నవరం మెట్ట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు, కల్యాణపులోవ జలాశయం ప్రమాదకర స్థాయికి చేరుకోగా.. 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నర్సీపట్నం - తుని మధ్య వాహనాల రాకపోకలను నిలిపేశారు. నర్సీపట్నం - తుని మధ్య వాగులు పొంగి పొర్లుతున్నాయి.

  • అల్లూరి జిల్లాలోని (Alluri District) వట్టిగెడ్డ జలాశయం పొర్లు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా రాకపోకలు నిలిచిపోయాయి. రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు వద్ద వట్టిగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జోలాపుట్ జలాశయం నుంచి 23 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అటు, డుడుమా జలాశయం 4 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 
  • మరోవైపు, కాకినాడ జిల్లాలోనూ (Kakinada District) భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోటనందూరు మండలంలో అత్యధికంగా 3.6 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఏలూరు జలాశయం నిండుకుండలా మారగా.. దిగువకు 9,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 21 వేల క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. కిర్లంపూడి, పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాకినాడ జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. పెద్దాపురం, సామర్లకోట మండలాలకు ముప్పు పొంచి ఉండగా.. క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
  • విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోనూ విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల దృష్ట్యా విశాఖలోని ఆంధ్రా వర్శిటీకి సెలవు ఇచ్చారు. సోమవారం జరగాల్సిన పరీక్షల షెడ్యూల్‌ను వాయిదా వేశారు. అటు, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లోనూ విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
  • భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,17,270 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

అటు, అల్లూరి జిల్లాలోని కొత్తపల్లి జలపాతం ఉగ్రరూపం దాల్చింది. వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో వరద పోటెత్తింది. దీంతో పర్యాటకులు సందర్శనకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే అనుమతిస్తామని తెలిపారు. జలపాతం ఉగ్రరూపంతో ఉరకలు వేస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తుండగా నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ మరో 20 ఏళ్లే పని చేస్తుంది- ఏబీపీ దేశంతో కన్నయ్య సంచలన కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget