News
News
X

జర్నలిజం టీచర్‌గా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి- నెల్లూరులో జర్నలిస్ట్ లకు పాఠాలు

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకం అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నెల్లూరు నగరంలో ఒకరోజు పర్యటనకు వచ్చిన జర్నలిస్ట్ వర్క్ షాప్ ప్రారంభించారు.

FOLLOW US: 
 
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకం అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నెల్లూరు నగరంలో ఒకరోజు పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక రమారాయల్ హోటల్ లో జర్నలిస్ట్ ల వర్క్ షాప్ ని ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా అభివృద్ధి కార్యక్రమాల అనుసంధానకర్తలుగా పాత్రికేయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్యర్వంలో వార్తాలాప్ (పాత్రికేయుల వర్క్ షాప్) కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కిషన్ రెడ్డి జ్యోతి వెలిగించి వర్క్ షాప్ ప్రారంభించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజాసంక్షేమం కోసమే అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతుందని, ప్రజలకు మేలు చేసే ఉద్దేశమే అందులో ఉంటుందని, క్షేత్ర స్థాయిలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పాత్రికేయుల చొరవతో వాటిని సరిదిద్దుకోవాలని చెప్పారు కిషన్ రెడ్డి. జర్నలిస్ట్ లు, పోలీసులు, రాజకీయ నాయకులకు పండగలు, సెలవులు ఉండవని, సమాజం కోసం ఎవరి స్థాయిలో వారు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తూ ఉంటారని అన్నారు.

వైద్యులు ఆరోగ్య సంరక్షణతో, ఉపాధ్యాయులు విద్యాబోధనతో.. తమ తమ బాధ్యతలు నిర్వహిస్తున్నట్టే, జర్నలిస్ట్ లు సమాజాన్ని జాగృతం చేయటంతోపాటు, ప్రజలు - ప్రభుత్వం మధ్య వారధిగా విలక్షణమైన బాధ్యత నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పథకాల గురించి జర్నలిస్ట్ లకు తెలియజేసే ఉద్దేశంతో వార్తాలాప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

News Reels

ప్రభుత్వం పేదలకోసం ఏమేం పథకాలు అందిస్తోంది. వాటి ద్వారా ప్రజలు ఎలా లబ్ధి పొందాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరం, ఎవరు అర్హులు, లబ్ధి పొందలేని వారికి ఇతర పథకాలు ఉన్నాయా.. అనే విషయాలను తెలియజేసేందుకు జర్నలిస్ట్ లు చొరవ తీసుకోవాలని సూచించారు కిషన్ రెడ్డి. విమర్శించడం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమన్న ఆయన, తెలుసుకుని విమర్శించాలి, మంచి కార్యక్రమాలను అభినందించాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమ విజయంలో ప్రజలు, పాత్రికేయులు పోషించిన పాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించిన ఆయన, అందరూ కలిసి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రచురిస్తున్న పక్షపత్రిక న్యూ ఇండియా సమాచార్ గురించి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలన్నింటినీ ఈ పత్రిక తెలియజేస్తుందని, ఇందులో సమాచారం తెలుసుకోవచ్చని, విమర్శించడానికి కూడా ఈ పుస్తకం పనికొస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విలేకర్లు మరింత జాగృతమై ఉండాలని, అక్కడి ప్రజలకు ప్రభుత్వ పథకాల వివరాల గురించి తెలియజేసి, వారి వెనుక అండగా నిలబడాలని, ఇది పాత్రికేయులే గాక, ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని పేర్కొన్నారు. రాజకీయలు, పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందేందుకు ప్రతి ఒక్కరి చొరవ అవసరమని పేర్కొన్నారు. ఈ దిశగా అభివృద్ధిని ప్రోత్సహించే పాత్రికేయానికి పెద్ద పీట వేయాలని సూచించారు.

Published at : 07 Nov 2022 06:11 PM (IST) Tags: Kishan Reddy Nellore Update Nellore News

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

దీపం ఒత్తులు, బొట్టుబిళ్లల ఘరానా మోసగాడు అరెస్ట్

దీపం ఒత్తులు, బొట్టుబిళ్లల ఘరానా మోసగాడు అరెస్ట్

AP News Developments Today: రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో అధికారుల బిజీ బిజీ - కీలక నేతలంతా నేడు విజయవాడలోనే

AP News Developments Today: రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో అధికారుల బిజీ బిజీ - కీలక నేతలంతా నేడు విజయవాడలోనే

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.