Nellore News : పిల్లకాయలకు పిప్పర్‌మెంట్లు - ఎమ్మెల్యేకు గోల్డ్ బిస్కెట్లా ? సర్వేపల్లి ఎమ్మెల్యేపై మరోసారి సోమిరెడ్డి ఫైర్ !
సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ నేతల మధ్య క్రెడిట్ గేమ్ ప్రారంభమైంది. కాకాణి, సోమిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ జిల్లాగా ఏర్పాటు చేసింది. అయితే అనూహ్యంగా ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్న సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని మాత్రం శ్రీ బాలాజీ జిల్లాలో కలపలేదు. నెల్లూరు జిల్లాలోనే ఉంచింది. ఒక వేళ అలా కలిపినట్లయితే ప్రజలు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేసి ఉండేవారు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఉంటేనే సర్వే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం ఏం ఆలోచించిందో.. ఎలా ఆలోచించిందో కానీ నెల్లూరులోనే సర్వేపల్లిని ఉంచడంతో ఇప్పుడు రాజకీయ పార్టీల నేతలు ఇది తమదంటే.. తమ ఘనతగా చెప్పుకుంటూ రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది రాను రాను రాజకీయ పోరాటంగా మారుతోంది.
ఏపీకి న్యాయం కోసం ఇప్పటికైనా పోరాడాలి - మోదీ వ్యాఖ్యలపై సీఎం జగన్‌కు ఉండవల్లి సలహా !
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉంచడానికి తానే కృషి చేశానని చెబుతున్నారు. ఈ సందర్బంగా సంబరాలు నిర్వహిస్తున్నారు. దీనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడుతున్నారు. సర్వేపల్లిని నెల్లూరులోనే ఉంచినందుకు పిల్లలకు పిప్పర్ మెంట్లు పంచిపెడుతున్నారని కానీ ఎమ్మెల్యే మాత్రం అవినీతితో గోల్డ్ బిస్కెట్లు సంపాదించుకుంటున్నారని మండిపడ్డారు జిల్లాల విభజన నోటిఫికేషన్ రాక ముందు సర్వేపల్లిని నెల్లూరులో కొనసాగించాలని ఎక్కడైనా ఒక కూత కూశావా అంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డిని సోమిరెడ్డి ప్రశ్నించారు.
మంత్రి సిదిరి అప్పలరాజుకు చేదు అనుభవం.. అలిగి వెనక్కి తగ్గిన మంత్రి!
జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్ రాకముందు బెల్టు షాపులు, ఇసుక దందా వంటి అక్రమాలకు పాల్పడ్డాలని.. కాకాణి అక్రమాల కోటలన్నీ ఒక్కొక్కటిగా బద్దలవుతాయని హెచ్చరించారు. మీటింగ్ కోసం అని అధికారులను పిలిపించుకుని జగన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేయిస్తున్నారని ఆరోపించారు. పాలాభిషేకాలతో ఎంత కడిగినా వారికి అంటుకున్న మలినం పోదని అన్నారు. నకిలీ మద్యం కేసులో ఏ - 10 గా ఉన్న కాకాణి ఇప్పుడు నీతిమంతుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాకాణి చెత్త భాష మానుకోవాలని, సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు.
నెల్లూరు రాజకీయాలు జిల్లాల విభజనతో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఇతర చోట్ల రెవిన్యూ డివిజన్లు, జిల్లా కేంద్రాల కోసం పోరాటం సాగుతోంది. అయితే నెల్లూరులో మాత్రం రాజకీయ పార్టీ నేతలు భి్నంగా వెళ్తున్నారు. క్రెడిట్ గేమ్ ఆడుతున్నారు.