అన్వేషించండి

మా స్వామివారు మాకు దొరికారు.. చోరీ కేసు మీడియా సమావేశానికి వచ్చిన పూజారులు

దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులను ఆశీర్వాదం అందించారు పూజారులు. తమ స్వామిని తమకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

సహజంగా దొంగల ముఠాని పట్టుకున్నప్పుడు పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు, వారిని మీడియాకి చూపించి రిమాండ్ కి తరలిస్తారు. కానీ నెల్లూరులో మాత్రం దొంగల ముఠాని పట్టుకున్న పోలీసుల ప్రెస్ మీట్ కాస్త వెరైటీగా సాగింది. దొంగలు తీసుకెళ్లింది స్వామివారి పంచలోహ విగ్రహాలు కావడం, అవి ఆ ఊరి వారికి సెంటిమెంట్ కావడంతో.. ఆ ఊరి పెద్దలు, నాయకులు, ఆలయ పూజారులు కూడా తరలి వచ్చారు. తమ స్వామివారిని తమకు అప్పగించినందుకు ఎస్పీ విజయరావుకి అభినందనలు తెలపడంతోపాటు వేదాశీర్వచనాలు అందించారు. 

నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలోని అచ్యుత స్వామి దేవాలయంలో.. శ్రీదేవి, భూదేవి సమేత అచ్యుత స్వామి పంచలోహ విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లారు. వీరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.  
 
నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసే ఆరుగురు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలోని ఐదు దేవాలయాల్లో వీరు విగ్రహాలు, హుండీలు, మైక్ సెట్లు దొంగిలించుకు వెళ్లారు. కడపలో 3, ప్రకాశంలో 2 దేవాలయాల్లో దొంగతనాలు చేశారు. ఎట్టకేలకు వీరు నెల్లూరు పోలీసులకు చిక్కారు. వీరిలో ఐదుగురు కడప జిల్లా వాసులు కాగా.. దొంగల ముఠా నాయకుడు ప్రకాశం జిల్లా గిద్దరూలు వాసి, పేరు షేక్ లాల్ భాషాగా గుర్తించారు.  

ఆటోలో వస్తారు, అంతా దోచుకెళ్తారు
ఆలయాల్లో దొంగతనాలు చేసే ఈ ముఠా.. రెండ్రోజుల ముందునుంచీ రెక్కీ నిర్వహిస్తుంది. ఆటోలో వచ్చి అంచనా వేసుకుని వెళ్తారు. దొంగతనం చేసే రోజు కూడా వీరు ఆటోలో వచ్చి గుడి సమీపంలో దాన్ని ఆపుతారు. ఇద్దరు బయట కాపలా కాస్తే, నలుగురు లోపలికి వెళ్లి గ్రిల్స్ తొలగించి విగ్రహాలు, హుండీ, నగలు మాయం చేస్తారు. దేవాలయాలతోపాటు, చర్చిలో కూడా వీరు దొంగతనం చేసినట్టు తెలిపారు పోలీసులు. పంచలోహ విగ్రహాలు, 10వేల రూపాయల నగదు వీరినుంచి స్వాధీనం చేసుకున్నారు. 

ప్రెస్ మీట్ అనంతరం తమ స్వాములవారి విగ్రహాలను అందించినందుకు కుల్లూరు గ్రామస్తులు, నాయకులు ఎస్పీ విజయరావుని అభినందించారు. పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు.

Also Read: Warangal Crime: రోడ్డు పనుల్లో బంగారు హారం దొరికింది... నాటకంతో నకిలీ బంగారం విక్రయం... వరంగల్ వచ్చి పోలీసులకు చిక్కారు

Also Read: Nagapur Fake Gang Rape : రేపిస్టుల కోసం నాగపూర్‌లో వెయ్యి మంది పోలీసుల ఆపరేషన్ ! చివరికి అసలు తప్పు చేసిన వారు స్టేషన్‌లోనే దొరికారు..

Also Read: Woman Cuts Husband Genitals : నో అంటే నో..లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ? వైఫ్ అయినా కట్ చేసేస్తుంది ! ఆ ఊళ్లో అదే జరిగింది !

టాప్ హెడ్ లైన్స్

Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు.. అధికారులకు ఏపీ ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు.. అధికారులకు ఏపీ ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
Chandrababu Pawan Kalyan Meeting: చంద్రబాబుతో ముగిసిన పవన్‌ కళ్యాణ్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై చర్చ
చంద్రబాబుతో ముగిసిన పవన్‌ కళ్యాణ్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై చర్చ
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
CM Revanth Reddy: వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
Asian Para Dominance: బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత
బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత, జపాన్ గడ్డపై భారత్ ప్రభంజనం
BRS Legal Notice Strategy: రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
Embed widget