News
News
X

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

మెగా ఫ్యాన్స్ వేరు, జనసైనికులు వేరు కాదని, ఇకపై అందరూ ఒక్కతాటిపై ఉండాలని, పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కలసి నడవాలని పిలుపునిచ్చారు అభిమానులు. నెల్లూరులో మెగా గర్జన సభ నిర్వహించారు.

FOLLOW US: 
 
మెగా ఫ్యాన్స్ వేరు, జనసైనికులు వేరు అనేది లేదని.. ఇకపై అందరూ ఒక్కతాటిపై ఉండాలని, పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కలసి నడవాలని పిలుపునిచ్చారు అభిమానులు. నెల్లూరులో మెగా గర్జన సభ పేరుతో సభ నిర్వహించారు. ఈ మెగా గర్జన సభకు మెగాస్టార్ అభిమానులు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా హాజరయ్యారు. ఇకపై మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఒక్కటేనని, వారంతా పవన్ కల్యాణ్ జనసేనకు మద్దతు తెలుపుతారని అన్నారు నాయకులు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజీ వల్ల అభిమానులంతా కలవలేకపోయారని, ఈసారి ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా అభిమానులు పవన్ కల్యాణ్ కోసం ఒక్కటిగా నిలబడతారని చెప్పారు. 

గతంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మెగా అభిమానులంతా ఆయనకు అండగా నిలబడ్డారు. అధికారం చేజిక్కించుకోలేదు కానీ ప్రజారాజ్యం పార్టీ తన ఉనికి చాటుకుంది. కానీ పవన్ కల్యాణ్ జనసేన పెట్టినప్పుడు మాత్రం అభిమానులనుంచి ఆస్థాయిలో మద్దతు రాలేదు. దాని ఫలితమే గత ఎన్నికల్లో జనసేన కేవలం ఒకే ఒక్క సీటుకి పరిమితం కావడం. స్వయానా పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేసినా ఆయన గెలవలేకపోయారు, అసెంబ్లీ మెట్లు ఎక్కలేకపోయారు. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుంది..? వైసీపీపై ప్రజా వ్యతిరేక ఉందని అంటున్నారు జనసేన నాయకులు. మరి ఆ వ్యతిరేకత నిజమైతే ప్రతిపక్షాలు గెలవాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేసినా ఆయన్ను గెలిపించుకుంటామని చెబుతున్నారు జనసైనికులు. తిరుపతిలో ఆయన పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గతంలో ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల ప్రజలు కూడా ఈసారి పోటీ చేస్తే విజయం ఖాయమని చెబుతున్నారు. 

News Reels

పవన్ కల్యాణ్ ప్యాన్స్, జనసైనికులు వేర్వేరు కాదు. పవన్ అభిమానులంతా జనసైనికులుగా మారిపోయారు. కొంత పర్సంటేజ్ మాత్రం సినిమాల వరకే మాకు పవన్ కల్యాణ్, రాజకీయాల్లో మా నిర్ణయం మాదేనంటున్నారు. మరోవైపు మెగా స్టార్ అభిమానులు పూర్తిగా పవన్ వైపు టర్న్ కాలేదు. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అభిమానులుంటే అది ఎవరికీ ఉపయోగం కాదని, అభిమానులంతా జనసేనకు సపోర్ట్ చేయాలని కోరుతున్నారు జనసైనికులు. 

మెగాస్టార్ అభిమానులైనా, పవర్ స్టార్ అభిమానులైనా, రామ్ చరణ్ అభిమానులైనా అందరూ ఒకతాటిపైకి రావాలని ఈసారి కచ్చితంగా పవన్ కి సపోర్ట్ ఇవ్వాలంటున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో మెగా గర్జన సభ జరిగింది. మెగాస్టార్ అభిమానుల్ని ఈ కార్యక్రమానికి పిలిచి సత్కరించారు జనసేన నేతలు. వారి మద్దతు కావాలని కోరారు. ఇకపై జనసేన కార్యక్రమాల్లో మెగా అభిమానులంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్ ని గెలిపించుకోవాలని అందరూ కలసి ప్రతిజ్ఞ చేశారు. మెగా అభిమానులంతా పవన్ వైపు వస్తే లెక్కలేవైనా మారతాయా..? కేవలం సినిమా అభిమానులతో పవన్ కల్యాణ్ అద్భుతాలు సృష్టించగలరా..? ఈ ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధాం చెప్పలేం కానీ.. మెగా అభిమానుల అండదండలు పవన్ కి కచ్చితంగా ఉపయోగపడతాయని అంటున్నారు. 

Published at : 25 Sep 2022 06:49 PM (IST) Tags: chiranjeevi Nellore news Pawan Kalyan nellore abp Nellore Janasena praja rajyam janasena nellore

సంబంధిత కథనాలు

Nadendla Manohar : పవన్ ప్రచార రథం రంగుపై వైసీపీ విమర్శలు, నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్

Nadendla Manohar : పవన్ ప్రచార రథం రంగుపై వైసీపీ విమర్శలు, నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Jabardasth Teja - Pavithra: ‘జబర్దస్త్’ తేజాకు, పవిత్రకు పెళ్లి? వైరల్ అవుతోన్న వీడియో

Jabardasth Teja - Pavithra: ‘జబర్దస్త్’ తేజాకు, పవిత్రకు పెళ్లి? వైరల్ అవుతోన్న వీడియో