Bhuvaneswari Letter : సమాజంలో విలువల్ని కాపాడాలి.. మరొకరికి ఇలాంటి అవమానం జరగకూడదని నారా భువనేశ్వరి బహిరంగ లేఖ
ఏపీ అసెంబ్లీలోతనకు జరిగిన లాంటి అవమానం మరెవరికీ జరగకూడదని నారా భువనేశ్వరి అన్నారు. మద్దతుగా నిలిచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ లేఖ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనకు జరిగినటువంటి అవమానం మరెవరికీ జరగకూడదని నారా భువనేశ్వరి ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తనకు జరిగిన అవమానాన్ని తమ తల్లికి, చెల్లికి, తోబుట్టువుకు జరిగినట్లుగా భావించిన నిరసన వ్యక్తం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీరంతా అండగా ఉండటాన్ని జీవితంలో మర్చిపోలేనన్నారు. తమను తల్లిదండ్రులు ఉన్నత విలువలతో పెంచారని.. వాటిని ఇప్పటికీ పాటిస్తున్నామన్నారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని గౌరవించాలన్నారు. కష్టాల్లో ఉన్న వారికి సాయపడాలని ప్రజలను కోరారు.
Also Read : ఏపీ వరి ధాన్యం లారీలకు తెలంగాణలో నో ఎంట్రీ .. సరిహద్దుల్లో నిలిచిన లారీలు !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీ మంత్రి కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు చంద్రబాబు సతీమణిని దూషించిన ఘటన రాజకీయంగా కలకలం రేపింది. తనను.. తన కుటుంబసభ్యులను ఇంత దారుణంగా అవమానిస్తున్న కౌరవ సభను బాయ్ కాట్ చేస్తున్నానని.. మళ్లీ సీఎంగా మాత్రమే హాజరవుతానని సవాల్ చేశారు. ఆ తరవాత ప్రెస్‌మీట్‌లో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటన కలకలం రేపింది.
Also Read : ఏపీలో సినిమా టికెట్ల ఇష్యూ నేడు తేలుతుందా? చిరంజీవి ట్వీట్‌పై పేర్ని నాని ఏమన్నారంటే..
ఆ తర్వాత ఈ అంశంపై టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురికి బెదిరింపులు వస్తున్నాయన్న కారణంగా ప్రభుత్వం సెక్యూరిటీని పెంచింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పలు మహిళా సంఘాలు కూడా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించ పరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేనికి లేఖ కూడా రాశాయి.
Also Read: Kodali Nani: ఎన్టీఆర్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఎప్పుడో విడిపోయాం
ఈ అంశంపై నందమూరి కుటుంబసభ్యులు అందరూ స్పందించి... అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఊరుకునేది లేదన్నారు. అయితే తాము భువనేశ్వరిని ఏమీ అనలేదని వారు వాదిస్ున్నారు. ఈ క్రమంలో తొలి సారిగా భువనేశ్వరి ఈ ఘటనపై స్పందించారు. మరొకరికి ఇలాంటి అవమానం జరగకూడదన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
Also Read: Chiru : దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి