News
News
X

Perni Nani: ఏపీలో సినిమా టికెట్ల ఇష్యూ నేడు తేలుతుందా? చిరంజీవి ట్వీట్‌పై పేర్ని నాని ఏమన్నారంటే..

పేర్ని నాని శుక్రవారం ఉదయం సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆయన వరద బాధితులను పరామర్శిస్తున్న తీరుపై మండిపడ్డారు.

FOLLOW US: 

ఏపీలో సినిమా టికెట్ల అంశంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్‌పై మంత్రి పేర్ని నాని స్పందించారు. సానుకూలంగా స్పందించిన ఆయన జీవో నెం.35లో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని అన్నారు. టికెట్ ధరల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, బుక్ మై షో, జ‌స్ట్ బుకింగ్, పేటీఎం వంటి సినిమా టికెట్లు అమ్మే వెబ్‌సైట్, యాప్ ప్రతినిధులతో మంత్రి పేర్ని నాని మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఏపీ స‌చివాల‌యంలో స‌మావేశం కానున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ టికెట్‌ల వ్యవ‌హ‌రంలో సినిమా హ‌ళ్ళతో టికెటింగ్ యాప్స్ యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆన్‌లైన్ టికెట్ంగ్‌కు ప్రైవేటు టికెటింగ్ యాప్ కంపెనీలు ప్రధాన అవ‌రోధం కానున్నాయి. దీంతో వారితో చ‌ర్చలు చేయాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది.

వరద బాధితుల వద్ద ఆ ప్రస్తావన ఏంటి?: పేర్ని
పేర్ని నాని శుక్రవారం ఉదయం సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆయన వరద బాధితులను పరామర్శిస్తున్న తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వంలో లోపాలు చూపితే సరి చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు వరద బాధితుల దగ్గరకెళ్లి ఆయన సతీమణి భువనేశ్వరి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు. భువనేశ్వరిని తిట్టారంటూ బాధితుల దగ్గర ఏడుపు ఎందుకని ప్రశ్నించారు. ఆమెను తాము ఏమీ అనలేదని అన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబును చీదరించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు సభ్యసమాజం ఏమనుకుంటారు అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రతిపక్ష నేత హుందాగా వ్యవహరించాలని.. ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి చెప్పాలని అన్నారు. అంతేగాని బాధితుల వద్దకు రాజకీయ విమర్శలు తగదని హితవు పలికారు.

‘‘చంద్రబాబు, టీడీపీ నేతలు శ్రుతి మించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గాల్లో కలిసి పోతాడని అంటారు.. నీ కొడుకు వయసున్న ఒక వ్యక్తిని అలా మాట్లాడొచ్చా..? నువ్వు మాత్రం ఎన్నేళ్లయినా బతకొచ్చా..? చంద్రబాబు చిల్ బుల్ బాబా.. లోకేష్ బ్యాటింగ్ బాబా.. వీళ్ళు వందేళ్లు బతుకుతారు..’’ అని పేర్ని నాని సెటైర్లు వేశారు.

Also Read: Kodali Nani: ఎన్టీఆర్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఎప్పుడో విడిపోయాం 

Also Read: TDP Jr NTR : జూ. ఎన్టీఆర్ ప్రకటనపై టీడీపీలో అసంతృప్తి .. ఘాటుగా స్పందించలేదని విమర్శలు !

Also Read: Chandrababu Naidu: తండ్రి తాగితేనే అమ్మ ఒడి.. అలాంటి పథకాలు మనకు అవసరమా?

Also Read: Chiru : దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 26 Nov 2021 10:53 AM (IST) Tags: ap govt minister perni nani Movie tickets in AP Chiranjeevi tweet Movie tickets issue in AP

సంబంధిత కథనాలు

హాస్టళ్ల విద్యార్థలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్

హాస్టళ్ల విద్యార్థలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్

Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

TDP Youth : యువత చేతుల్లోకి టీడీపీ - త్వరలో సంచలన మార్పులు ఉంటాయా ?

TDP Youth : యువత చేతుల్లోకి టీడీపీ - త్వరలో సంచలన మార్పులు ఉంటాయా ?

TDP Women Leaders : అన్ని పార్టీల మహిళా నేతలతో కలిసి ప్రభుత్వం ఉద్యమం - గోరంట్ల ఇష్యూలో టీడీపీ దూకుడు !

TDP Women Leaders : అన్ని పార్టీల మహిళా నేతలతో కలిసి ప్రభుత్వం ఉద్యమం  - గోరంట్ల ఇష్యూలో టీడీపీ దూకుడు  !

Guntur News : కార్పొరేషన్ అధికారులపై కార్పొరేటర్లు ఫైర్, అవినీతిపై హాట్ కామెంట్స్

Guntur News :  కార్పొరేషన్ అధికారులపై కార్పొరేటర్లు ఫైర్, అవినీతిపై హాట్ కామెంట్స్

టాప్ స్టోరీస్

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య

Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య

Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !

Border Love Story :  ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !

Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి

Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి