Kodali Nani: ఎన్టీఆర్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఎప్పుడో విడిపోయాం
జూనియర్ ఎన్టీఆర్ నాకు ఎటువంటి సంబంధం లేదు అని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చెపితే ఎందుకు వింటాను అని ప్రశ్నించారు.
జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒకప్పుడు చిత్రపరిశ్రమల కలిసి పని చేశామని.. ఇప్పుడు ఎన్టీఆర్ చేపితే నేను ఎందుకు వింటాను..? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ తో విభేదాలు రావటంతో పూర్తిగా విడిపోయినప్పటికీ హరికృష్ణ కుమారుడిగా గౌరవం ఉందని తెలిపారు. తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబితే మాత్రమే వింటామని.. ఎన్టీఆర్ చెపితే వినాల్సిన అవసరం తనకు లేదని కొడాలి నాని స్పష్టం చేశారు.
'కడప, చిత్తూరు జిల్లాల పర్యటన సందర్బంగా.. ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు, అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కారించాలని డిమాండ్ చేయాలి. కానీ, వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏం చూశాడో, ఏం చేశాడో తెలియదు కానీ.. అక్కడకు వెళ్లగానే ఏడుపు మొహం పెట్టుకుని నా భార్యను అవమానించారంటూ మాట్లాడుతున్నారు. వరదల్లో సర్వం కొట్టుకుపోయి వాళ్లు ఇబ్బందులు పడుతుంటే.. చంద్రబాబు అక్కడ కూడా ఏదోరకంగా రాజకీయ లబ్ధి పొందటం కోసం తన భార్య అంశాన్ని ప్రస్తావనకు తేవడం సిగ్గుచేటు. ఆమె పేరును మేముగానీ, మరే ఇతర సభ్యులు గానీ ప్రస్తావించలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా చంద్రబాబు వినడం లేదు. రాజకీయం చేసేందుకు ఏదో కారణం కావాలి. 40 మంది చనిపోయి, ఉండానికి ఇల్లులేక, తినడానికి తిండిలేక వాళ్లు ఏడుస్తుంటే... వాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఏడుపు, బాధేంటి చంద్రబాబూ...? వారు కష్టాల్లో ఉంటే, మీ పనికిమాలిన సొల్లు పురాణం అక్కడ అవసరమా?' అని కొడాలి నాని విమర్శించారు.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన కామెంట్స్ చేశారు. భువనేశ్వరిపై వైసీపీ సభ్యుల వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 12 గంటల పాటు ఆయన భార్యతో కలిసి తన నివాసంలో నిరసన చేపడుతున్నారు. అయితే.. భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల అన్నారు.
వాళ్లను అప్పుడే కంట్రోల్ పెడితే.. ఇంతదాకా వచ్చేది కాదన్నారు. నానికి ఎన్టీఆర్ అంటే భయమని.. కానీ ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల అన్నారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్ విఫమయ్యారని అన్నారు. సినిమా కోసం కుటుంబాన్ని నైతిక విలువలను వదులుకోవడం ఏంటని ప్రశ్నించారు.
అయితే ఈ విషయంపై మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ చెబితే.. తాము కంట్రోల్ ఉండటమేంటని.. అది సరికాదాని చెప్పారు.
Also Read: TDP Jr NTR : జూ. ఎన్టీఆర్ ప్రకటనపై టీడీపీలో అసంతృప్తి .. ఘాటుగా స్పందించలేదని విమర్శలు !
Also Read: Chandrababu Naidu: తండ్రి తాగితేనే అమ్మ ఒడి.. అలాంటి పథకాలు మనకు అవసరమా?
Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !
Also Read: Chiru : దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి