Nagababu Janasena : వైఎస్ఆర్‌సీపీ పతనాన్ని కళ్లారా చూస్తాం - యువశక్తి సభలో నాగబాబు జోస్యం !
వైఎస్ఆర్‌సీపీ పతనాన్నికళ్లారా చూస్తామని నాగబాబు హెచ్చరించారు. రణస్థలంలో జరుగుతున్న యువశక్తి సభలో ఆయన ప్రసంగించారు
Nagababu Janasena : యువత రాజకీయాల్లోకి రాకపోతే దుర్మార్గులు వస్తారని జనసేన నేత, సినీనటుడు నాగబాబు అన్నారు. జనసేన ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస వద్ద నిర్వహించిన 'యువశక్తి' కార్యక్రమంలో నాగబాబు మాట్లాడారు. జనసేన కుల పార్టీ కాదని యుతవ పార్టీ అన్నారు. యువత రాజకీయాల్లోకి రాకపోతే దుర్మార్గులు వస్తారన్నారు. దుర్మార్గులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పిల్లల భవిష్యత్ ను దోచుకుతింటారన్నారు. వైసీపీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందన్నారు. పవన్ వారాహి యాత్రను అడ్డుకోవడానికే జీవో నెం.1 తీసుకొచ్చారన్నారు. అడ్డొచ్చిన వారిని తప్పించాలని జగన్ చూస్తున్నారన్నారు. జగన్ విద్యావంతుడు కాదని, చరిత్ర తెలియదన్నారు. జగన్ చెప్పిన మాట వినరు.. ఆయనకు చెప్పే ధైర్యం చేయరన్నారు. ఉద్యోగులపై నిఘా ఉపాధ్యాయులను వేధిస్తున్నారన్నారని మండిపడ్డారు.
జనసేన యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తాను పార్టీ అభివఅద్ధికి మాత్రమే పనిచేస్తానని చెప్పారు. వైసిపి నేతలు, సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు, ప్రజలను చితక్కొట్టడమే తమ నైజం అన్నట్లుగా అధికార పార్టీ నేతల వ్యవహారశైలి ఉందన్నారు. తాను పార్టీ అభివృద్ధికి మాత్రమే పనిచేస్తానని చెప్పారు. ప్రతిపక్షాలు, ప్రజలను చితక్కొట్టడమే తమ నైజం అన్నట్లుగా అధికార పార్టీ నేతల వ్యవహారశైలి ఉందన్నారు. దాడులకు గురైన వారిపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని.. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ పతనాన్ని త్వరలోనే మనమంతా కళ్లారా చూస్తామని నాగబాబు వ్యాఖ్యానించారు. జనసేన పార్టీలో ప్రత్యేకంగా సీం అభ్యర్థులెవరూ ఉండరని..జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ సీఎం అభ్యర్థేనని నాగబాబు వ్యాఖ్యానించారు.
మరో వైపు ఈ సభకు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనసైనికులు, పవన్ అభిమానులు వచ్చారు. దీంతో సభా ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. నేటి యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సభలో చర్చిస్తున్నారు. భా వేదికపై యువత ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పలు రాజకీయ తీర్మానాలు చేస్తారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస పంచాయితీ పరిధిలో 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో పవన్ సభ నిర్వహిస్తున్నారు. రణస్దలం సమీపంలో యువశక్తి పేరిట నిర్వహిస్తున్న ఈ సభను జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేసారు. సభా ప్రాంగణానికి వచ్చే నాలుగు గేట్లకు ఉత్తరాంద్ర యోధులైన గిడుగు రామ్మూర్తి పంతులు , వీరనారి గున్నమ్మ , కోడిరామ్మూర్తి నాయుడు, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టారు.
యువశక్తి సభకు సుమారు లక్షమంది వరకూ యువకులు హాజరయ్యే అవకాశం ఉందని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు. వేదికపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు మరో వందమంది వరకూ యువకులు ప్రసంగించే విధంగా ఏర్పాట్లు చేసారు. ఉత్తరాంధ్ర యువత ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు స్దానికంగా ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈ వేధిక ద్వారా ఎండగట్టనున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై యువశక్తి సభ ద్వారా పవన్ ప్రకటన చేస్తారు.