By: ABP Desam | Updated at : 23 Jan 2022 12:20 PM (IST)
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
Vasantha Krishna Prasad Covid Positive: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తి పెరగడంతో ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలో మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేరారు. అందరిని పలకరించినట్లే కరోనా తనను కూడా పలకరించిందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రకటించారు.
దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో డాక్టర్ల సలహ మేరకు కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. ఫలితాలలో తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. తనతో పాటు నా వ్యక్తిగత సహయకుడు అర్జున్ కి కూడ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. తనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెప్పారు.
Koo Appఅందరిని పలకరించినట్లే కరోనా తనను కూడా పలకరించిందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రకటించారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో డాక్టర్ల సలహ మేరకు కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. ఫలితాలలో తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తనతో పాటు నా వ్యక్తిగత సహయకుడుకి కూడ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. #VasanthaKrishnaPrasad #CoronaVirus #Covid19 https://telugu.abplive.com/andhra-pradesh/mla-vasantha-krishna-prasad-tested-positive-for-covid19-19513 - Shankar (@guest_QJG52) 23 Jan 2022
గత మూడేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను ఇబ్బందులకు గురిచేస్తోంది. తనకు కూడా కరోనా సోకిందని.. ఇటీవల తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసరం ఉంటే నన్ను ఫోన్ లో తనను సంప్రదించవచ్చునని చెప్పారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. ఏపీలో కొత్తగా 12,926 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారి నుంచి మరో 3,913 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం.. 73 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: Subhas Chandra Bose Jayanti 2022: 125వ జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్ అరుదైన చిత్రాలు చూద్దాం...
Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?