Lokesh Yuvagalam ; ఏపీ , కర్ణాటక మధ్య పెట్రోల్ ధరల్లో ఎంత తేడా అంటే ? పాదయాత్రలో లోకేష్ చూపించారు...
కర్ణాటక భూభాగంలో ఉన్న పెట్రోల్ బంక్‌లో లోకేష్ కాన్వాయ్ కు పెట్రోల్ కొట్టించారు. ఏపీకి, కర్ణాటకకు మధ్య లీటర్ కు ఉన్న ధర తేడాను ప్రజల ముందు ఉంచారు.
Lokesh Yuvagalam : తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. నాల్గోవ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా వి.కోట సమీపంలోని కర్ణాటక పెట్రోల్ బంక్ ను నారా లోకేష్ పరిశీలించారు.. అనంతరం ఆయన కాన్వాయ్ రూ. 3,000 డీజిల్ కొట్టించారు. తానే స్వయంగా డబ్బులు ఇచ్చి ఏపీలో ఉన్న రేట్లకి కర్ణాటకలో ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లకి ఉన్న తేడాను తెలుసుకున్నారు. పెట్రోల్, డీజిల్‌పై జగన్ రెడ్డి బాదుడే బాదుడు అని లోకేష్ మండిపడ్డారు. కర్ణాటకలో లీటర్ డీజిల్ రూ.88, పెట్రోల్ రూ.102 అని... ఏపీలో లీటర్ డీజిల్ రూ.99.27, రూ.పెట్రోల్ 111.50లుగా ఉందని... అంటే జగన్ రెడ్డి బాదుడు 10 రూపాయిలు అని చెప్పుకొచ్చారు. తనతో నడుస్తున్న ప్రజలకు, కార్యకర్తలకు రేట్ల తేడా గురించి వివరించారు. దేశం మొత్తంలో ఏపీలోనే ఎక్కువ రేట్లు ఉన్నాయంటూ పన్నుల భారం గురించి ప్రజలు, కార్యకర్తలకు లోకేష్ వివరించారు.
కర్ణాటక రాష్ట్రం పంతాన్ హల్లి చేరుకున్న లోకేష్ అన్న పాదయాత్ర తన కాన్వాయ్ వాహనాలకు దగ్గరుండి డీజిల్ కొట్టించిన లోకేష్ అన్న
— అనిల్ ☣️ (@Anil1k98) January 30, 2023
పెట్రోల్ డీజిల్ పై జగన్ రెడ్డి బాదుడే బాదుడు
కర్ణాటక లో డీజిల్ ₹88 పెట్రోల్ ₹102 ఏపీలో డీజిల్ 99.27 పెట్రోల్ 111.50 జగన్ రెడ్డి బాదుడు#YuvaGalamPadayatra pic.twitter.com/2gymhYb4Vh
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో పెట్రోలు ధరల్లో చాలా వ్యత్యాసముంది. కుప్పం ప్రజలు కర్ణాటక బార్డర్‌కు వెళ్లి బండికి పెట్రోలు కొట్టించుకుంటున్నారు. లిక్కర్ కోసం కూడా కర్ణాటకకు పరుగులు తీస్తున్నారని టీడీపీ కార్యకర్తలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడికంటే క్వార్టర్ ధర వంద రూపాయలు అక్కడ తక్కువని... పైగా ఏపీ లిక్కర్ తాగితే ప్రాణానికీ ప్రమాదమన్నారు. ఆర్టీసీ ఛార్జీలు సహా అన్నీ పెంచేశాడు. ధరల బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టాడని.. జగన్ పై లోకేష్ పలు చోట్ల విమర్శలు గుప్పించారు.
లోకేష్ యువగళం పాదయాత్ర నాలుగో రోజు పలమనేరు నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా లోకేష్‌ను వి.కోటలో పట్టుగూళ్ల రైతులు కలిశారు. ప్రభుత్వం తమకు సబ్సిడీ ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై స్పందించిన లోకేష్.. టీడీపీ అధికారంలోకి రాగానే.. సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం జీఎమ్మార్ కళ్యాణ మండపంలో యువతతో టీడీపీ నేత భేటీ అవుతారు. ఆపై వి.కోట కూరగాయల మార్కెట్‌లో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం వి.కోట ఆగా కల్యాణ మండపం ఎదురుగా ముస్లిం మైనారిటీలతో సమావేశమవుతారు. అనంతరం కృష్ణాపురం క్రాస్ వరకు పాదయాత్ర సాగనుంది. రాత్రికి కృష్ణాపురం టోల్‌గేట్ సమీపంలో లోకేష్ బస చేస్తారు.
లోకేష్ పాదయాత్ర కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పలమనేరు నియోజవకర్గంలో సాగుతున్న పాదయాత్రకు ఉదయమే పెద్ద ఎత్తున పార్టీ నేతలు తరలి వస్తున్నారు. రోజంతా పాదయాత్ర జనాల మధ్య సాగుతోంది.
మేం సత్యవంతులం కాదు - కానీ టీడీపీ హయాం కంటే తక్కువ అవినీతి చేస్తున్నామన్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే !