Lakshmi Parvati : టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ స్వాధీనం చేసుకోవాలి - అదే తన కోరికన్న లక్ష్మి పార్వతి !
జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకోవాలని లక్ష్మి పార్వతి సలహా ఇచ్చారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Lakshmi Parvati : జూనియర్ ఎన్టీఆర్.. అమిత్ షాతో భేటీ కావడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇందులో లక్ష్మి పార్వతి కూడా తన అభిప్రాయం చెప్పారు. టీడీపీ పుంజుకోవాలంటే కచ్చితంగా ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలని కోరారు.. వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు దగ్గర నుంచి టీడీపీ పార్టీని జూనియర్ ఎన్టీఆర్ స్వాధీనం చేసుకొని, టిడిపికి నూతన అధ్యాయం తీసుకు రావాలను కోరారు. ప్రస్తుతం లక్ష్మి పార్వతి వైఎస్ఆర్‌సీపీ నాయకురాలిగా ఉన్నారు. తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్‌గా ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు, టీడీపీపై విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై తనదైన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో లక్ష్మిపార్వతి కీలక వ్యాఖ్యలు
స్వర్గీయ గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి వేడుకల నిర్వహణ ఏర్పాట్లను తిరుపతిలో పరిశీలించారు లక్ష్మీ పార్వతి. గురువారం ఎస్వీ యూనివర్సిటీ వేదికగా గిడుగు బాషా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. టీడీపీ పార్టీ., జూనియర్ ఎన్టీఆర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారింది. గిడుగు బాషా ఉత్సవాలు సందర్భంగా రేపు ఆరుగురికి పురస్కార గ్రహీతలను సత్కరించనున్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. గత ప్రభుత్వం హయాంలో 30 వేల స్కూల్స్ మూత పడ్డాయయని గుర్తు చేశారు.
జగన్ తెలుగును కాపాడుతున్నారన్న లక్ష్మి పార్వతి
విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు కు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు. విమర్శలు చేస్తున్న వారు, తెలుగు భాష అభవృద్ధికి కృషి చేస్తున్నాము అంటున్న వారు వాళ్ళ పిల్లలు నీ ఆంగ్ల భాషలో చదివించడం లేదా అని ప్రశ్నించారు. పేద పిల్లలు ఆంగ్ల బాషా అందుటులోకి తీసుకు వచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు. తెలుగుకు సీఎం జగన్ ద్రోహం చేశారు అంటున్న వాఖ్యలు చేయడం అవాస్తవాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తెలుగు స్కూల్స్ ను పెద్ద సంఖ్యలో మూసి వేశారన్నారు. తెలుగు మరియు సంస్కృత అకాడమీ కు టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి తిరుపతి గోశాల వద్ద స్థలం కేటాయించారన్నారు..
ఎన్టీఆర్ కుటుంబంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే లక్ష్మిపార్వతి
లక్ష్మీ పార్వతి అంటేనే టీడీపీ అధినేత చంద్రబాబు భద్ర శత్రువుగా పేరుంది. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, పార్టీని చంద్రబాబు హస్తగతం చేస్తుకున్నారని బహిరంగానే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టినా అప్పట్లో అంత ఆదరణ రాలేదు. దీంతో పార్టీని ఆమె మూసివేసి సైలెంట్ అయ్యారు. అనంతరం వైసీపీ పార్టీలో అడుగుపెట్టిన లక్ష్మీ పార్వతి క్రియాశీలక రాజకీయాల్లో కి వచ్చారు. వైఎస్ఆర్‌సీపీ తరపున ఎప్పుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని విమర్శించాలన్నా ఆమె ముందు ఉంటారు. ఇటీవల ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్యపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌పై స్పందించి అదే రీతిలో చర్చనీయాంశం అయ్యారు.