మళ్లీ నోరు జారిన రాహుల్ గాంధీ- రిజల్ట్స్ ముందే లీక్
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ఏపీలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ మరోసారి నోరు జారారు.
మళ్లీ రాహుల్ గాంధీ నోరుజారారా లేదంటే ముందుగానే చెప్పేశారా ? ఇప్పుడిదే హాట్ న్యూస్. ఎప్పుడు ఎక్కడ ఎందుకు అన్న వివరాల్లోకి వెళ్తే…
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ఏపీలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ మరోసారి నోరు జారారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడలేదు. అప్పటికి ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదు. ఇంకా ఎవరు మెజార్టీలో ఉన్నారు..ఎవరిది గెలుపన్న విషయాలు బయటకు రాలేదు. కానీ రాహుల్ గాంధీ మాత్రం పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటే అది ఫాలో అవుతామంటూ మల్లిఖార్జున ఖర్గేని అడగండని చెప్పేశారు. దీంతో అధికార ప్రకటనకు ముందే రాహుల్ గాంధీనే మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడని బయటపెట్టేశారు.
ఏపీలో తిరిగి కాంగ్రెస్ గెలిస్తే.. కేంద్రంలో కూడా కాంగ్రెస్సే ఉంటే విభజన హామీలన్నింటిని అమలు చేస్తామని చెప్పారు. రాజధాని ఒక్కటే ఉండాలని చెబుతూ అమరావతి రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పొత్తుల విషయం గురించి మాట్లాడుతూ వైసీపీతో దోస్తీ చేయాలా లేదా అన్నది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని ఆ విషయాన్ని ఖర్గేని అడిగితే బాగుటుందని చెప్పడంతో విజేత ఆయనేనని తేలిపోయింది.
25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నేతగా ఖర్గే నిలిచారు. కర్నాటకు చెందిన ఈ సీనియర్ నేత గాంధీ విధేయుడిగా పేరుండటంతో సోనియా గాంధీ చివరి నిమిషంలో ఖర్గేని అధ్యక్ష పోటీలో దింపడంతో ఆయనే గెలుస్తారని ముందుగానే పార్టీ శ్రేణులు డిసైడ్ అయ్యాయి. ఊహించిన విధంగానే శశిథరూర్ పై ఖర్గే విజయం సాధించి కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిలిచారు.
LIVE: Press Conference | Bharat Jodo Yatra | Andhra Pradesh
— Rahul Gandhi (@RahulGandhi) October 19, 2022
https://t.co/6yvqROBb7I
సోమవారం జరిగిన ఎన్నికల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ శ్రేణులు ఖర్గేకు ఓటు వేశారు. పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ పోటీ పడ్డారు. ఇవాళ (అక్టోబర్ 19న) ఫలితాలు వెలువడ్డాయి. దీంతో 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టననున్నారు.
సోమవారం జరిగిన ఎన్నికల్లో ఖర్గేకు అనుకూలంగా చాలా మంది తమ ఓటు వేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌లో జరిగిన ఎన్నికల్లో 7897 మంది ఖర్గేకు అనుకూలంగా ఓట్లు వేశారు. 1072 మంది శశిథరూర్‌కు అనుకూలంగా ఓటు వేశారు. అంటే 6800పైగా మెజారిటీతో ఖర్గే విజయం సాధించారు. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడ్డారు. వీరి మధ్య గట్టిగానే పోటీ నెలకొంది. ఎక్కువ మంది మాత్రం ఖర్గే వైపే మొగ్గు చూపతూ తీర్మానాలు కూడా చేశారు. చాలా రాష్ట్రాల్లో ఆయనకు అనుకూలంగా ప్రచారం చేశారు. తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ లీడర్లు ఖర్గేకు ఓటు వేశారు. ఆయన ప్రత్యక్షంగా వచ్చి అందర్నీ కలిసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.