Kodali Nani On Chiru : చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో తెలుసు - గుడివాడలో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించిన కొడాలి నాని
చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్ని గుడివాడలో కొడాలి నాని నిర్వహించారు. తాను చిరంజీవిని విమర్శించలేదన్నారు.
Kodali Nani On Chiru : తనకు చిరంజీవికి మద్య అగాధాన్ని క్రియేట్ చేసేందుకు తెలుగు దేశం పార్టీ ప్రయత్నిస్తోందిన మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గ శాసన సభ్యుడు కొడాలి నాని వ్యాఖ్యానించారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా కొడాలి నాని గుడివాడలో అభిమానులతో కలసి కేక్ కట్ చేశారు. గుడివాడలో చిరంజీవి యువత ఆధ్వర్యాన చిరు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కొడాలి నాని ముఖ్య అతిధిగా పాల్గొని చిరంజీవి పేరు మీద జన్మదిన కేక్ ను కట్ చేశారు. అభిమానులకు మిఠాయిలు పంపిణి చేశారు. ప్రతి ఏటా తాను చిరంజీవి జన్మదిన వేడుకలను నిర్వహిస్తానని కూడ కొడాలి నాని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని చిరంజీవి అభిమానులు నిత్యం తన వెంట ఉంటారని అన్నారు.
మెగా స్టార్ చిరంజీవిని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులు వక్రీకరించారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. తాను మోగా స్టార్ చిరంజీవిని విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని చాలెంజ్ విసిరారు. తాను శ్రీరామ అన్నా తెలుగు దేశం, జనసేన నాయకులకు బూతు మాటలుగా వినపడతాయన్నారు. తాను మాట్లాడిన మాటలు అన్నీ చిరంజీవికి, ఆయన అభిమానులకు కూడ తెలుసని చెప్పుకొచ్చారు. తామంతా క్లారిటీ గానే ఉన్నామని అన్నారు.
రాజకీయంగా చింజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసని .. అయితే అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని గురించి, తమ గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతానని హెచ్చరించారు. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన మెగా స్టార్ చిరంజీవి అని, ఆయన్ను విమర్శించేంత సంస్కారహీనుడును తాను కాదని చెప్పుకచ్చారు. చిరంజీవి అభిమానుల ముసుగులో, తెలుగు దేశం, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్లు మీద దొర్లారని ఆరోపించారు. చిరంజీవికి , తమకు మధ్య అగాధం సృష్టించాలని తెలుగు దేశం, జనసేన పార్టీలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రజారాజ్యం తరఫున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి, చేతులెత్తి నమస్కారం పెట్టానని కొడాలి నాని గుర్తు చేశారు. చిరంజీవిని అనేక సందర్భాల్లో తాను వ్యక్తిగతంగా కలిశానని, పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామని వివరణ ఇచ్చారు. తమకు సలహా ఇచ్చినట్లే డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే తాను మాట్లాడాని ఆ మాటలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదనుకోవటం అవివేకమని, తాను ఆయన గురించి మాట్లాడినట్లు ఎట్లా అవుతుందని అన్నారు. తన వెంట ఉన్న వ్యక్తుల్లో 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనని వివరణ ఇచ్చారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో మెగా స్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. అదే సమయంలో సిని పరిశ్రమ పై సర్కార్ ది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో లు బయటకు రావటంతో వాటిని పై మాజీ మంత్రి కొడాలి నాని వెంటనే స్పందించి కామెంట్స్ చేశారు. దీని పై గుడివాడలోనే చిరంజీవి అభిమానులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. అటు రాజకీయంగా, ఇటు సిని పరిశ్రమ పరంగాకూడ ఈ వ్యవహరం సంచలనంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కామెంట్స్ చేశారు. అయితే కొడాలి నాని పకొడి గాళ్ళు అంటూ చేసిన కామెంట్స్ చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడిన మాటలుగా ప్రచారం జరిగింది. దీంతో నియోజకవర్గంలో ఉన్న కాపు ఓట్ బ్యాంక్ వ్యతిరేకం కావడంతో కొడాలి నాని నష్టనివారణా చర్యల్లో భాగంగానే చిరంజీవి బర్త్ డే ను సెలబ్రేట్ చేసిన వివరణ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.