JC Vs Prabhakar : అనంత టీడీపీలో మరోసారి కలకలం.. తాడిపత్రిలోకి ప్రభాకర్ చౌదరి ఎంట్రీ !
టీడీపీలో రెండు వర్గాలుగా పోరాడుతున్న జేసీ వర్గం, ప్రభాకర్ చౌదరి వర్గం ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నాయి. జేసీ ప్రభాకర్ చౌదరి తాడిపత్రిలో కార్యక్రమం చేపట్టం వివాదాస్పదం అవుతోంది.
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు అంతకంతకూ ముదిరిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జేసీ బ్రదర్స్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి నేరుగా తాడిపత్రి వెళ్లిపోయారు. తాడిపత్రిలోతాము తప్ప మరో నేత అడుగుజాడల్ని జేసీ వర్గీయులు సహించరు. అలాంటిది నేరగా ప్రభాకర్ చౌదరి వెళ్లడంతో ఏం జరుగుతుందో టీడీపీ వర్గాలు టెన్షన్ పడ్డాయి.
Also Read : బద్వేలు నామినేషన్లు ప్రారంభం ! బీజేపీ -జనసేన అభ్యర్థి ఎవరు ?
అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి "అవే" అనే స్వచ్చంద సంస్థను నిర్వహిస్తూ ఉంటారు. ఆ సంస్థ తరపున సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా తరచూ ఏర్పాటు చేస్తూంటారు. అయితే ఇప్పటి వరకూ ఆయన తాడిపత్రిలో ఎప్పుడూ ఎలాంటి కార్యక్రమం పెట్టలేదు. కానీ హఠాత్తుగా తాడిపత్రిలోని వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి ఇది టీడీపీ కార్యక్రమం కాదు. ఆయన సొంత స్వచ్చంద సంస్థ కార్యక్రమం. అయినప్పటికీ ఆయన టీడీపీ నేత కావడంతో పాటు జేసీ బ్రదర్స్‌తో తీవ్రంగా వ్యతిరేకించే నేత కావడంతో తాడిపత్రిలో ఆయన కార్యక్రమంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే ప్రభాకర్ చౌదరి కూడా ఆ కార్యక్రమానికి రాజకీయ ఉద్దేశం లేదన్నట్లుగానే ముగించారు. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు.
Also Read : రాజు తలుచుకుంటే వరాలకు కొదవా? సీఎం జగన్ కు నిర్మాత అల్లు అరవింద్ రిక్వెస్ట్..
ప్రభాకర్ చౌదరి కార్యక్రమంపై జేసీ వర్గీయులు వ్యూహాత్మకంగా స్పందించారు. వివాదం కాకుండా.. స్వచ్చంద సంస్థగా తాడిపత్రి ప్రజలకు ఎవరు సేవ చేసినా ఆహ్వానిస్తామంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో ప్రభాకర్ చౌదరి తాడిపత్రి వచ్చిన సమయంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దవడుగూరు మండలం వెళ్లిపోయారు. అక్కడ గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన ఉపాధి హామీ పనులకు సంబంధించి బిల్లులు చెల్లించలేదని.. తక్షణం చెల్లించాలని మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
Also Read: ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్
ప్రభాకర్ చౌదరికి, జేసీ బ్రదర్స్‌కు ఎప్పుడూ పార్టీలో పొసగని పరిస్థితి ఉంది. ఇటీవలే జేసీ వల్ల టీడీపీ తీవ్రంగా నష్టపోయిందని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. ఆ సమయంలో జేసీ దివాకర్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలోనే అనంతపురం జిల్ాలలోని వర్గ విభేదాల కారణంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అయినప్పటికీ టీడీపీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. ఒకరి నియోజకవర్గాల్లో ఒకరు జోక్యం చేసుకుంటూ తమదైన వర్గ రాజకీయాలు చేస్తూనే ఉన్నారు.
Watch Video : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?