Anantapur News: వైసీపీ కార్యకర్తల్ని చితక్కొట్టిన జగన్ సెక్యూరిటీ -అనంతపురం పెళ్లి వేడుకలో వివాదాస్పద ఘటన
Jagan private security: అనంతపురంలో ఓ పెళ్లికి హాజరయ్యారు జగన్. అయితే ఆయన ప్రైవేటు సెక్యూరిటీ కార్యకర్తల్ని కొట్టడం వివాదాస్పదమవుతోంది.

Jagan private security beat YCP workers: పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున వైసీపీ అధినేత జగన్ అనంతపురం పర్యటనకు వెళ్లారు. అయితే అది రాజకీయ పర్యటన కాదు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇంచార్జ్ విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడి పెళ్లికి వెళ్లారు. ఇటీవల పార్టీ నేతల ఇళ్లలో శుభకార్యాలకు జగన్ వెళ్తున్నారు. ఇటీవల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి పెళ్లికి కర్నూలు వెళ్లారు.
జగన్ వ్యక్తిగత పర్యటనకు వెళ్తున్నప్పటికీ.. కొంత మంది పార్టీ నేతలు జన సమీకరణ చేస్తున్నారు. రప్పా రప్పా ప్లకార్డులు పెట్టుకుని ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. జై జగన్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇలా అనంతపురంలోనూ ఆయన కోసం అభిమానుల్ని.. కొంత మంది పార్టీ నేతలు పెళ్లి మండలానికి తీసుకు వచ్చారు. బయట నినాదాలిచ్చి.. స్వాగతం పలికి ఉంటే సరిపోయేది కానీ.. అలా వచ్చిన వారు మండపంలోకి వచ్చేశారు.
అనంతపురం: ఉరవకొండ మాజీ శాసనసభ్యులు వై. విశ్వేశ్వర్ రెడ్డి గారి కుమారుడు ప్రణయ్,సాయి రోహిత ల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
— M.INDRASENAREDDY (@indrasena9966) August 13, 2025
రేపు ఉదయం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వివాహ కార్యక్రమంలో పాల్గొననున్నారు.#IndraSenaReddy pic.twitter.com/4N9ChFG9Kt
జగన్మోహన్ రెడ్డి కోసం ప్రభుత్వం సెక్యూరిటీ ఏర్పాటు చేసినా.. ఇటీవల సొంతంగా యాభై మంది మాజీ ఆర్మీ సిబ్బందితో ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. వారు జగన్ వద్దకు ఎవరూ రాకుండా రోప్ పార్టీగా ఉంటున్నారు. ఈ పెళ్లినూ ఆ సిబ్బంది రోప్ పార్టీగా నిలబడ్డారు.కానీ కొంత మంది కార్యకర్తలు జగన్ తో కరచాలనం చేసేందుకు రోప్ పార్టీని దాటి ముందుకు వచ్చారు. అంతే... ఈ ప్రైవేటు సెక్యూరిటీ ఒక్క సారిగా విరుచుకుపడింది. కార్యకర్తల్ని చితక్కొట్టింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చెలరేగిపోయిన జగన్ ప్రైవేటు సెక్యూరిటీ... వైసీపీ కార్యకర్తలని కుక్కలని కొట్టినట్టు చితకబాది పడేసారు..
— Yash (@YashTDP_) August 14, 2025
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహానికి అనంతపురం వెళ్ళిన జగన్.. పులివెందుల ఎన్నికల్లో డిపాజిట్ పోవటంతో, జగన్ ని ఒదార్చటానికి దగ్గరకు వచ్చిన కార్యకర్తలు..… pic.twitter.com/EGgmW0Ok2o
తన ప్రైవేటు సెక్యూరిటీ .. కార్యకర్తల్ని, అభిమానుల్ని కొడుతున్నా జగన్ పట్టించుకోలేదని.. కనీసం ఆపమని చెప్పలేదన్న విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలను జగన్ కొట్టిస్తున్నారని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభించారు.
అనంతపురంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి గన్‌మన్ వైకాపా కార్యకర్తను చితకబాదిన వీడియో. అనంతపురంలో జరిగిన ఓ వివాహ వేడుకకు జగన్ హాజరయ్యారు. ఆ సమయంలో వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో జగన్ గన్‌మన్ ఓ వైకాపా కార్యకర్తపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ మహిళ కూడా… pic.twitter.com/SBroOKh1pT
— Soma (@SSK_1924) August 14, 2025
రాజకీయ పార్టీల నేతలు వచ్చినప్పుడు.. చాలాచోట్ల దూరంగా నిలబడి అభివాదాలు చేస్తూంటారు. కానీ జగన్ పర్యటనలో మాత్రం.. కొంత మంది మీద పడిపోవాలని అనుకుంటూ ఉంటారు. వారితో జగన్ భద్రతకు సమస్యలు వస్తున్నాయంటున్నారు.





















