TDP wins Vontimitta: ఒంటిమిట్టలో కాస్త పోటీ ఇచ్చిన వైఎస్ఆర్‌సీపీ - 6267 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి విజయం
Vontimitta ZPTC by election: ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆరు వేల ఓట్లకుపైగా తేడాతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఈ స్థానం వైసీపీకి ఏకగ్రీవం అయింది.

TDP wins Vontimitta ZPTC by election: ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆయన 12, 780 ఓట్లతో గెలుపొందగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 653 ఓట్లు వచ్చాయి. గా ఒంటిమిట్టలో గత 30 ఏళ్లుగా వైసీపీ లేదా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు. ఎన్నికల్లో ఆయన రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఉపఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఒంటిమిట్టలో ముమ్మరంగా ప్రచారం చేసింది. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జనసేన నాయకుడు యల్లటూరు శ్రీనివాసరాజు వంటి నాయకులు ప్రచారంలో పాల్గొని, గ్రామీణ స్థాయిలో ఓటర్లను ఆకర్షించారు. ఈ కూటమి వ్యూహాత్మకంగా పంచాయతీల వారీగా బాధ్యతలు అప్పగించి, సమన్వయంతో పనిచేసింది. ఎన్నికలకు ముందు, ఒంటిమిట్ట ఎంపీపీ అక్కి లక్ష్మి దేవి, ఉప మండలాధ్యక్షురాలు గీతాతో సహా పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. ఈ చేరికలు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చాయి. టీడీపీకి స్థానిక స్థాయిలో మద్దతును పెంచాయి.
ఒంటిమిట్టలో రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకు బలంగా ఉన్నప్పటికీ, టీడీపీ బలిజ, చేనేత కార్మికులు, బీసీల మద్దతును సమర్థవంతంగా సమీకరించింది. ఇది ఓటు బ్యాంకు చీలికకు దారితీసి, టీడీపీకి అనుకూలంగా మారింది. ఒంటిమిట్టలో వైసీపీకి చెందిన కొందరు కీలక నాయకులు టీడీపీలో చేరడం వల్ల స్థానిక స్థాయిలో వారి పట్టు సడలింది. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ యొక్క వ్యూహాత్మక ప్రచారం, స్థానిక నాయకుల చేరికలు, వైసీపీ ఆత్మరక్షణ ధోరణి టీడీపీ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం
— Telugu Stride (@TeluguStride) August 14, 2025
రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీకి 12519 ఓట్లు
వైసీపీ అభ్యర్థికి 6298 ఓట్లు
6221 మెజారిటీతో ఉన్న టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి#zptcbyelections #vontimitta pic.twitter.com/iauVFFFUZO
ఒంటిమిట్ట మండలం రాజంపేట నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉండేది. గతంలో ఉమ్మడి కడప జిల్లాలోని పది స్థానాల్లో 9 చోట్ల ఓడిపోయినా రాజంపేటలో మాత్రం విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో ఏడు చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించినా రాజంపేటలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజంపేటలో పోటీ చేసిన అభ్యర్థి వైసీపీలో చేరిపోయారు. రాజంపేట ఎమ్మెల్యేగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన సిట్టింగ్ సీటుగా ఉన్న ఒంటిమిట్ట జడ్పటీసీలో పార్టీని గెలిపించలేకపోయారు.
వైసీపీ కంచుకోటల్ని తము బద్దలు కొట్టామని.. ఇక ముందు ముందు పులివెందుల కడప ప్రజలు పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని అనుభవించవచ్చని అంటున్నారు. ఇప్పటి వరకూ భయంతో ఎవరూ ఓట్లు వేసే పరిస్థితి ఉండేది కాదని ఇప్పుడు స్వేచ్చగా ఓట్లు వేస్తున్నారని అంటున్నారు.





















