YS Jagan: బటన్లు నొక్కి చంద్రబాబు మోసాల గురించి ప్రజలకు చెప్పండి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
YSRCP: ప్రభుత్వ వైఫల్యాలపై క్యూ ఆర్ కోడ్‌తో ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. బాబు హామీ..మోసం గ్యారంటీ అనే పేరుతో ప్రచారం చేయాలన్నారు.

YS Jagan QR Codes: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి .. ఏపీ ప్రభుత్వం ఐదు వారాల ప్రచార ఉద్యమం ప్రకటించారు. తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయిన ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. "రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో" పేరుతో క్యాంపెయిన్‌ను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి చంద్రబాబు మోసాలను ప్రజలకు తెలియజేయాలని జగన్ సూచించారు.
TDP నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు తల్లికి వందనం, స్త్రీ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం లాంటివి అమలు చేయడంలో విఫలమైందని ప్రజలకు తెలియచెప్పాలని జనగ్ సూచించారు. YSRCP క్యూఆర్ కోడ్‌ను ప్రజలకు అందజేస్తుంది, దీనిని స్కాన్ చేస్తే చంద్రబాబు మోసాలకు సంబంధించిన వివరాలు వస్తాయని జగన్ తెలిపారు. గత ఏడాది ఎగ్గొట్టిన మొత్తం, ఈ ఏడాది రావలసిన సంక్షేమ నిధుల వివరాలు క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు, మోసపూరిత హామీలను ఇంటింటికీ చేర్చడం ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమం 4 నుండి 5 వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందని.. YSRCP నాయకులు మరియు కార్యకర్తలు ఈ క్యాంపెయిన్‌ను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహించి, ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి వెళ్లి క్యూ ఆర్ కోడ్ బటన్ నొక్కి చంద్రబాబు మోసాలను ప్రచారం చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని జగన్ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు విఫలమైందని, ముఖ్యంగా మహిళల కోసం హామీ ఇచ్చిన స్త్రీ నిధి, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం వంటి హామీలు నెరవేరలేదన్నారు.
25.06.2025.
— YSR Congress Party (@YSRCParty) June 25, 2025
తాడేపల్లి.
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం.
పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల… pic.twitter.com/D0Uff2Dmp9
YSRCP పాలనలో అమలు చేసిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చదువు మానేసి ఉపాధి కోసం వెతుక్కోవాల్సి వస్తోందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర అందడం లేదని, నష్టంతో ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జగన్ అన్నారు. ప్రభుత్వం విపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని, అక్రమ కేసులు పెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తోందని జగన్ ఆరోపించారు. - సత్తెనపల్లి, పోడిలి, రెంటపల్ల వంటి ఊరిలో తన సందర్శనలపై పోలీసు ఆంక్షలు విధించడం ద్వారా ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ క్యూఆర్ కోడ్‌ను రాష్ట్రవ్యాప్తంగా పంచి, ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని జగన్ సూచించారు. ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, 2029 ఎన్నికల్లో YSRCPని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో పని చేయాలన్నారు.





















