Andhra Talliki Vandanam: పిల్లలకు తల్లికి వందనం డబ్బులిస్తారా? 26 ఎకరాలిస్తారా? - ఏపీ సర్కార్‌కు మహిళ సూటి ప్రశ్న
Kodumuru: 26 ఎకరాల భూమి ఉందని ఆ తల్లికి .. తల్లికి వందనం కింద డబ్బులివ్వలేదు. దాంతో ఆమె తన 26ఎకరాలు ఎక్కడుందో చూపించాలని లేకపోతే పథకం డబ్బులివ్వాలని కోరుతున్నారు.

Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన తల్లికి వందనం పథకంలో కొన్ని లోపాలు లబ్దిదారులను ఇబ్బంది పెడుతున్నాయి. కొన్నిచోట్ల రికార్డుల్లో లేకపోవడం..తల్లుల పేరిట భూమి ఎక్కువగా ఉందని రికార్డుల్లో నమోదు కావడం వంటి పొరపాట్ల వల్ల.. ఆయా తల్లులకు పథకం అందలేదు. దాంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇలా కోడుమూరులో ఓ మహిళకు ఇరవై ఆరు ఎకరాలు ఉందని.. రికార్డుల్లో ఉంది. దీంతో ఆమెకు పథకం వర్తించలేదు. కోడుమూరులో నివాసం ఉంటే గాయత్రికి నలుగురు పిల్లలు ఉన్నారు.
గాయత్రి అనే మహిళ పేరు ఇరవై ఆరు ఎకరాలు ఉన్నట్లుగా నమోదు
ఇప్పుడు ఆమె 26 ఎకరాలైనా చూపించండి.. లేదా తల్లికి వందనమైనా ఇప్పించండి అని అధికారులకు లేఖ ఇచ్చారు. కోడుమూరు రూరల్‌లో తల్లికి వందనం రాలేదని మహిళ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. నా ముగ్గురు పిల్లలకు ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద డబ్బులు రాలేదని.. కారణం అడిగితే 26 ఎకరాల పొలముందంటూ చెబుతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డబ్బులైనా ఇప్పించండి.. లేదా పొలమైనా చూపించండంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ నాగరాజుకు వినతి పత్రం ఇచ్చారు.
ముగ్గురు చదువుకునే పిల్లలు ఉండటంతో పథకం వర్తింప చేయాలని విజ్ఞప్తి
తమకు నలుగురు సంతానం కాగా, ముగ్గురు కుమార్తెలు, రెండేళ్లలోపు ఒక బాలుడు ఉన్నారని.. ఇందులో ముగ్గురు కుమార్తెలు ప్రస్తుతం 1, 4, 5వ తరగతులు చదువుతున్నారని చెప్పింది. ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం డబ్బులు జమ కాలేదని.. విషయం తెలుసుకోగా తమ కుటుంబం పేరు మీద 26 ఎకరాల భూమి ఉన్నట్లుగా చూపిస్తోందని, దీని వల్ల తమకు తల్లికి వందనం పథకం డబ్బులు పడలేదని ఆమె బాధపడింది. తమ పేరు మీద కేవలం ఎకరా 85 సెంట్ల భూమి మాత్రమే ఉందని, అధికారులు చర్యలు తీసుకుని తమకు తల్లికి వందనం పథకం వర్తించేలా చూడాలని కోరుతున్నారు.
పిల్లలు ఎంత మంది ఉన్నా అందరికీ తల్లికి వందనం
తల్లికి వందనం పథకం ద్వారా ఎంత మంది తల్లులు ఉన్నా..అందరికీ రూ.పదమూడు వేలుచొప్పున ప్రభుత్వం జమ చేసింది. గాయత్రి కుటుంబంలో చదువుకునే ముగ్గురు పిల్లలు ఉన్నందున 39వేల రూపాయలు వస్తాయి. అవి వస్తే పిల్లల చదువుకు ఉపయోగంగా ఉంటుందని ఆమె భావిస్తున్నారు. పేద కుటుంబం కావడం.. పథకాన్ని వర్తింప చేయాలని కోరుతున్నారు. 2024-25 విద్యా సంవత్సరం కోసం రూ. 9,407 కోట్ల నిధులను 67.27 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.అయితే ఇలాంటి సమస్యల వల్ల కొంత మంది ఇంకా.. జమ కాలేదు. వారు కార్యాలయాల చుట్ూట తిరుగుతున్నారు.





















