అన్వేషించండి

Andhra Pradesh: కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం

Amaravati: పెనుమలూరు సమీపంలో ప్రభుత్వశాఖలకు చెందిన కీలక దస్త్రాలు తగులబెడుతుండగా టీడీపీ శ్రేణులు గుర్తించారు. పొల్యూషన్ బోర్డు ఛైర్మన్ ఆదేశాలతోనే కాల్చివేసినట్లు తగలబెడుతున్న వ్యక్తి అంగీకరించాడు

Govt Documents Burnt: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చాలా అనుమానాలకు తావిస్తోంది. అలాంటి ఘటనే కృష్ణానది ఒడ్డున జరిగింది. బుధవారం రాత్రి ఏవో ఫైల్స్‌ను ఓ వ్యక్తి తగలబెడుతున్నారు. అక్కడే ఉన్న స్థానికులు చూసి ఏంటి ప్రశ్నించారు. అప్పుడుగానీ అర్థం కాలేదు అవి ప్రభుత్వానికి చెందిన ఫైల్స్ అని. విషయం తెలుసుకున్న వారంతా తగలబెట్టడాన్ని ఆపి ఏం జరిగిందని ప్రశ్నించడం మొదలు పెట్టారు. 
 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ(YSRCP) ప్రభుత్వంలో కీలక వ్యవహరించిన నేతలు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. అందుకు ఊతమిచ్చేలా నిన్న రాత్రి ఫైల్స్‌ తగలపెట్టే ఘటన ఉంది. కృష్ణా జిల్లా(Krishna District) పెనమలూరు(Penamaluru)లో రోడ్డుపక్కన పెద్దఎత్తున తగలపడుతున్న దస్త్రాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాటిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) ఫొటోలు ఉండటంతో ఆ దస్త్రాలు తీసుకొచ్చిన కారు డ్రైవర్‌ను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అవన్నీ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు(Pollution Control Board) ఛైర్మన్ సమీర్‌శర్మ (Sameer Sharma)ఆదేశాలతోనే ధ్వంసం చేసినట్లు డ్రైవర్ తెలిపాడు..
 
దస్త్రాలు దహనంతో కలకలం
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పెదపులిపాక వద్ద నిర్మానుష్యం ప్రదేశంలో పెద్దఎత్తున దస్త్రాలు తగులబెట్టడం కలకలం రేపింది. కారులో దస్త్రాలు తీసుకొచ్చిన దుండగులు వాటికి నిప్పంటించి తగులబెట్టారు. వాటిపై మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోలతోపాటు, విశాఖ(Visakha)కు చెందిన కొన్ని దస్త్రాలు ఉన్నట్లు గుర్తించిన స్థానిక తెలుగుదేశం నేతలు గుర్తించి ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌(Bode Prasad)కు తెలియజేశారు. స్థానికుల రాకను గమనించి కారులో పరారవుతుండగా...అప్పటికే ఎమ్మెల్యే పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు వచ్చి పారిపోతున్న కారును అడ్డగించి పట్టుకున్నారు. 
 
కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ది(APMDC) సంస్థలకు చెందిన బస్తాలకొద్దీ దస్త్రాలను దహనం చేశారు. వీటిల్లో కొన్ని హార్డ్‌డిస్కులు సైతం ఉన్నాయన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సీఎంవోకు చెందిన పత్రాలు సైతం ఉన్నాయన్నారు. బుధవారం రాత్రి సరిగ్గా 9 గంటలకు ఓ ఇన్నోవా వాహనంలో కరకట్టపైకి చేరుకున్నారు. వాహనంపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ కూడా ఉంది. అందులో నుంచి గుట్టల కొద్దీ దస్త్రాలు బయటకు తీసి తగలబెట్టడం మొదలుపెట్టారు. అటుగా వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్త...ఆ పత్రాలపై మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటో ఉండటాన్ని గమనించి...వెంటనే ఎమ్మెల్యేకు, తెదేపా నేతలకు సమాచారం ఇచ్చారు. వారు వెంబడించి నిందితులను పట్టుకున్నారు. డ్రైవర్‌ నాగరాజును గట్టిగా నిలదీయడంతో  పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు ఛైర్మన్ సమీర్‌శర్మ(Sameer Sharma) సూచనలతోనే ఈ ఫైళ్లు తగులబెట్టినట్లు  అంగీకరించాడు.
 
కాలిపోయిన ఫైళ్లలో కీలక సమాచారం..!
గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ అనేక ఆరోపణలు చేసింది. గనులశాఖ మంత్రిగానూ ఉన్న ఆయన హయాంలోనే రాష్ట్రంలో విలువైన ఖనిజ సంపద మొత్తం దోపిడీకి గురైందని విమర్శించింది. ఇసుక, మట్టి విచ్చలవిడిగా తవ్వేసుకున్నారని చంద్రబాబు, పవన్ కూడా మండిపడ్డారు. ముఖ్యంగా ఇసుక తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించిన మరుసటి రోజే కీలక దస్త్రాలు తగులబెట్టడం అనుమానాలకు తావిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. గనులు, ఇసుక తవ్వకాలపై సీఎం చంద్రబాబు  విచారణకు ఆదేశించి ఉంటారని...అందుకే దస్త్రాలు మాయం చేసేందుకు వాటిని కాల్చివేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం లోతుగా విచారణ జరిపిస్తే....కీలక విషయాలు భయటపడే అవకాశం ఉందని అంటున్నారు. కాలిపోయిన దస్త్రాల్లో హార్డ్‌డిస్కులు, సీఎంవోకు చెందిన సమాచారం ఉందని ప్రత్యక్షసాక్షులు చెప్పడం చూస్తే..చాలా విలువైన సమాచారమే కాల్చివేసినట్లు తెలుస్తోందని అనుమాన పడుతున్నారు. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget