అన్వేషించండి

Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్

Weather Report: బంగాళాఖాతంలో ఈ నెల 22న మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Rains Alert To Ap And Telangana: ఏపీ, తెలంగాణను వర్షాలు వీడడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా, దక్షిణ కోస్తాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా తమిళనాడులో అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉందని వెల్లడించింది. ఇది పశ్చిమదిశగా కదులుతూ బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఈ నెల 20 కల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. ఈ నెల 22వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇది వాయువ్య దిశగా పయనించి మరింత బలపడుతుందని తెలిపింది. 

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీలో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. శుక్రవారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. 

తెలంగాణలోనూ..

తెలంగాణలో రాబోయే 5 రోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం.. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్ధిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడేందుకు అవకాశాలున్నాయని చెప్పింది. 

శుక్రవారం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శనివారం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఆదివారం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. 

Also Read: Revanth Reddy : మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
AP IAS : ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం
ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
AP IAS : ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం
ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం
Group 1 Mains Exams: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ
YSRCP News: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి - వైఎస్‌ఆర్సీపీ వర్క్‌షాప్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి - వైఎస్‌ఆర్సీపీ వర్క్‌షాప్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు
Haryana CM takes oath : హర్యానా సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం - హాజరైన ఎన్డీఏ నేతలు - చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్
హర్యానా సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం - హాజరైన ఎన్డీఏ నేతలు - చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్
Railway Reservations :  రైలు ప్రయాణికులకు భారీ షాక్ -  టిక్కెట్ రిజర్వేషన్ల గడువుపై  రైల్వే శాఖ సంచలన నిర్ణయం
రైలు ప్రయాణికులకు భారీ షాక్ - టిక్కెట్ రిజర్వేషన్ల గడువుపై రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Embed widget