అన్వేషించండి

Konaseema District Name: కోనసీమ జిల్లా ఇక నుంచి బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ - గెజిట్ నోటిఫికేషన్ విడుదల

Konaseema District Name: కోనసీమ జిల్లా పేరును డాక్టర్.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ మారుస్తూ... రాష్ట్రం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

Konaseema District Name:  కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్నాళ్ల పాటు జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన గొడవలు, ఆందోళనలకు నోటిఫికేషన్ తో తెర దించింది. నేటి వరకూ కోనసీమ పేరుతో జిల్లాగా కొనసాగిన ఈ ప్రాంతం ఇప్పటి నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమగా కొనసాగనుంది.   

ఏపీలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ పేరుతో అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. వీరి విజ్ఞాపనకు స్పందించిన ప్రభుత్వం జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పేరుగా మార్చేందుకు రంగం సిద్ధం చేశారు.

ఆందోళనలు, పోలీసుల లాఠీ ఛార్జ్..

అయితే కోనసీమ పేరును అలాగే ఉంచాలని.. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పేరుగా మార్చొద్దంటూ మరికొంత మంది ఆందోళనలు చేపట్టారు. ముఖ్యంగా కోనసీమ ముద్దు-వేరే పేరు వద్దు అనే నినాదంతో కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి చేసింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేలాది మంది ఆందోళన కారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉరుకులు, పరుగులు తీశారు. దీనికోసం పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాది మంది చేరుకొని నిరసనలు చేపట్టారు. సెక్షన్ 144, 30 పోలీస్ యాక్ట్ ఆంక్షలను కూడా ఆందోళన కారులు లెక్కచేయలేరు. బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసన కారులకు కూడా గాయలయ్యాయి. 
Also Read: MLA Jyothula: ‘ఇప్పుడు ఈ పార్టీలో ఉంటా, రేపు ఇంకోపార్టీలోకి పోతా’ YSRCP ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మే 18వ తేదీన ప్రాథమిక గెజిట్ నోటిపికేషన్..

కోనసీమ జిల్లా పేరును డాక్టర్. బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 18వ తేదీన ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.  అభ్యంతరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నెల రోజల సమయం ఇచ్చింది. ఆ ప్రతిపాదనకు జూన్ 24వ తేదీన రాష్ట్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. కోనసీమ జిల్లాలోని 22 మండలాల ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. అన్నింటినీ క్రోడీకరించి.. ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకొని స్పష్టతకు వచ్చారు.  ఆ తర్వాత 40 రోజులకు ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ విడదల చేయడం గమనార్హం. సాధారణంగా మంత్రి మండలి ఆమోదం తెలిపిన తర్వాత వారంలోపే గెజిట్ నోటిఫికేషన్  విడుదల అవుతుంది. కానీ దానికి భిన్నంగా ఇంత అసాధారణమైన జాప్యం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 
Also Read: Nara Lokesh On Visakha Gas Leak: సీఎం జగన్ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు: నారా లోకేష్ ఫైర్

టాప్ హెడ్ లైన్స్

Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
AP Local Body Unanimous Elections: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాల రచ్చ - వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపణలపై లభించని సానుభూతి - నాడు ఇలా చేయడమే కారణమా?
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాల రచ్చ - వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపణలపై లభించని సానుభూతి - నాడు ఇలా చేయడమే కారణమా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Embed widget