MLA Jyothula: ‘ఇప్పుడు ఈ పార్టీలో ఉంటా, రేపు ఇంకోపార్టీలోకి పోతా’ YSRCP ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jaggampeta MLA: వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ మార్పు అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జోతుల చంటిబాబు మాట్లాడారు.
‘‘ఈ పార్టీలు శాశ్వతం కాదు, నేను ఈ రోజు ఈ పార్టీలో ఉంటాను, రేపు పోతాను. రేపటి రోజున ఈ పార్టీ నుండి ఇక్కడ నుండి ఎవరు పోటీ చేస్తారో ఎవరికి తెలుసు? పార్టీలు ఎంతమంది మారటంలేదు’’ అంటూ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నేను ఉన్నంతవరకు సక్రమంగా చూసుకోవడం నా బాధ్యత. టెక్నికల్ సమస్యలు ఉంటే సానుకూలంగా స్పందించి అవకాశం ఉన్నంతవరకు బాధితులకు సంక్షేమ పథకాలు అందేలా చూడండి’’ అంటూ ఎమ్మెల్యే మాట్లాడారు.
అయితే, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇలా మాట్లాడుతుండడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాలు, జగన్ తో సమావేశం అనంతరం ఎమ్మెల్యే చంటిబాబులో స్వరం మారిందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఆయన ఈవిధంగా మాట్లాడటంపై నియోజకవర్గంలో చర్చ మొదలైంది.