Mekapati Goutham Reddy : మేకపాటి ఫ్యామిలీలో ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో తెలుసా ?
మేకపాటి కుటుంబం వ్యాపార, రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఆ కుటుంబంలో పలవురు ఎంపీ దగ్గర్నుంచి కింది స్థాయి పదవుల వరకూ అనేక చోట్ల సేవలందించారు..అందిస్తున్నారు.
ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ( Mekapat Goutham Reddy ) కుటుంబం రాజకీయ, వ్యాపారాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగారు. రాజకీయాల్లో ఎన్నో పదవుల్లో ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి తన తండ్రి రాజమోహన్‌రెడ్డి అడుగు జాడల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తండ్రి రాజమోహన్‌రెడ్డి 1985లో ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. అనంతరం 1989, 2004, 2009, 2012, 2014లో ఒంగోలు, నర్సరావు పేట, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతపార్టీ పెట్టిన తర్వాత ఆయన వెంట నడిచారు. ఆయన వారసులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతున్నారు.
దూకుడైన పార్టీలో సంప్రదాయ నేత ! ఎవర్నీ అనని, అనిపించుకోని లీడర్ గౌతంరెడ్డి !
రాజమోహన్‌రెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో గౌతమ్‌రెడ్డి ఒక్కరే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గౌతమ్‌రెడ్డి బాబాయ్ చంద్రశేఖర్‌రెడ్డి 2019లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కూడా 2004, 2009, 2012ల్లో ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఉదయగిరి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఇతర బంధువులు పలువురు స్థానిక సంస్థల నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ పదవులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సంపూర్ణ ఆరోగ్యం - క్రమం తప్పని వ్యాయామం ! అయినా ఎందుకిలా ?
మేకపాటి మరో కుమారు ఫృధ్వీ కుమార్ రెడ్డి కూడా ఇటీవల రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఉదయగిరి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ లోపు మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో పడిపోయింది. గౌతం రెడ్డి కుమారుడు ఇంకాచదువుకుంటున్నారు.
గోల్డెన్ అవర్" కూడా రక్షించలేకపోయింది ! మేకపాటి విషయంలో క్షణక్షణం ఏం జరిగిందంటే ?
కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ దేశంలో బడా కాంట్రాక్ట్ సంస్థల్లో ఒకటి. అత్యంత కీలకమైన రహదారుల నిర్మాణంలో ఆ సంస్థ ఎన్నో కీలకమైన ప్రాజెక్టులు పొందింది. లండన్‌లో చదువుకుని వచ్చిన తరవాత మేకపాటి గౌతం రెడ్డి కొంత కాలం తన సోదరులతో కలిపి సంస్థ నిర్వహణకు చూసుకున్నారు.అయితే తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేందుకు తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. మేకపాటి కుటుంబీకుల పేర్లపై దాదాపుగా ఇరవై కంపెనీల వరకూ ఉన్నాయి. అన్నీ కలిపి టర్నోవర్ వేల కోట్లలోనే ఉంటుందని తెలుస్తోంది.