అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Mekapati Goutham Reddy : "గోల్డెన్ అవర్" కూడా రక్షించలేకపోయింది ! మేకపాటి విషయంలో క్షణక్షణం ఏం జరిగిందంటే ?

సాధారణంగా గుండెపోటు వచ్చిన వారిని గంటలోపు ఆస్పత్రికి తీసుకెళ్తే సులువుగా రక్షించవచ్చంటారు. కానీ మేకపాటి విషయంలో పది నిమిషాల్లోనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. మేకపాటి విషయంలో క్షణక్షణం ఏం జరిగిందంటే ?

Mekapati Goutham Reddy :  ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ( Mekapati Goutham Reddy ) హఠాన్మరణం తెలుగు  రాష్ట్రాల్లో అందర్నీ కలచి వేస్తోంది.  రాజకీయాల్లో శత్రువులు లేని నేతగా ఆయన అందరి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే రాష్ట్రం కోసం ఆయన తన బాధ్యతల్ని సంపూర్ణ స్థాయిలో నిర్వర్తించారు. వారం రోజుల పాటు దుబాయ్‌లో ( Dubai )  ఏపీ కోసం పెట్టుబడులు సమీకరించే లక్ష్యంతో ప్రయత్నించే ఆదివారం తెల్లవారుజామునే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక్క రోజులోనే ఆయన గుండెపోటుకు గర చనిపోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మేకపాటి గౌతం రెడ్డి దుబాయ్ నుంచి వచ్చినప్పటి నుండి ఏం చేశారో  కుటుంబం అందించిన వివరాలు ఇవి.  

రాత్రి జరిగిన ఓ ఫంక్షన్ లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా ఇంటికి చేరిన మంత్రి మేకపాటి

06.00 గం.లకి రోజూలాగే ఉదయాన్నే మేల్కొన్న మంత్రి

06:30 గం.ల వరకూ మంత్రిగారు ఫోన్ లతో కాలక్షేపం

07.00 గం.లకు మంత్రి నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో కూర్చుని ఉన్న మంత్రి మేకపాటి

07:12కి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పిన మంత్రి  గౌతమ్ రెడ్డి

07:15గం.లకు  హఠాత్తుగా గుండెపోటుతో సోఫా నుంచి మెల్లిగా కిందకి ఒరిగిన మంత్రి

7:16 గం.లకు కంగారు పడి గట్టిగా అరిచిన మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి

07:18 పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మంత్రి ఛాతిమీద చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించిన మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావు

07:20 గం.లకు  మంత్రి మేకపాటి పక్కనే ఉన్న  భార్య శ్రీకీర్తి అప్రమత్తం 

07:20 మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో.. మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచిన భార్య శ్రీకీర్తి

07:22 "నొప్పి పెడుతుంది కీర్తి" అంటున్న మంత్రి మాటలకు స్పందించి వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరిన మంత్రి సిబ్బంది

07:27 మంత్రి ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి గల 3 కి.మీ దూరాన్ని, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో అపోలో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి చేర్చిన మంత్రి మేకపాటి డ్రైవర్,సిబ్బంది 

08:15 గం.లకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని తెలిపిన అపోలో వైద్యులు

09:13 గం.లకు మంత్రి మేకపాటి ఇక లేరని నిర్ధారించిన అపోలో ఆస్పత్రి వైద్యులు

09:15 గం.లకు మంత్రి మేకపాటి చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించిన అపోలో

వాస్తంగా చెప్పాలంటే ఉదయం ఆరుర  గంటలకు మేకపాటి గౌతంరెడ్డి నిద్రలేచారు. ఏడున్నర గంటల కల్లా ఆయన తీవ్రమైన గుండెపోటుకు గురైన  అచేతన స్థితిలోకి వెళ్లిపోయారు. గుర్తించిన సిబ్బంది వెంటనే.. అది కూడా పది నిమిషాల్లో ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. సాధారణంగా గుండెపోటుకు గురైన వారిని గంటలో ఆస్పత్రికితీసుకెళతే ప్రాణాపాయం తక్కువగా ఉంటుందని చెబుతూంటారు. కానీ గౌతం రెడ్డి విషయంలో ఆ గోల్డెన్ అవర్ కూడా పని చేయలేదు. పది నిమిషాల్లోనే ఆస్పత్రికి తీసుకు వచ్చినా ప్రయోజనం లేకపోయింది. 
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget