News
News
X

Mekapati Goutham Reddy : సంపూర్ణ ఆరోగ్యం - క్రమం తప్పని వ్యాయామం ! అయినా ఎందుకిలా ?

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆరోగ్యకరమైన జీవనశైలి. అయినా ఎందుకు గుండెపోటుకు గురయ్యారు ?

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతంరెడ్డి ( Mekapati Goutham Reddy )  హఠాన్మరణం అందర్నీ కలచి వేస్తోంది. ఆయన వయసు యాభై ఏళ్లు మాత్రమే. అంతే కాదు ఆయన ఆరోగ్య పరంగా చాలా ఫిట్‌గా ఉంటారు. జిమ్, యోగా ( Yoga )  రెగ్యూలర్‌గా చేస్తారు. డైట్ ఫుడ్ ఫాలో అవుతారు. అందుకే ఆయనకు రెండు సార్లు కరోనా ( Corona ) సోకినా  లక్షణాలు కూడా పెద్దగా బయటపడలేదు. త్వరగానే కోలుకున్నారు. అందుకే ఆయన మరణం అంటే చాలా మంది నమ్మలేకపోతున్నారు. గుండెపోటు ( Heart Attack ) అంటే అసలే నమ్మలేకపోతున్నారు.

దూకుడైన పార్టీలో సంప్రదాయ నేత ! ఎవర్నీ అనని, అనిపించుకోని లీడర్ గౌతంరెడ్డి !

గౌతంరెడ్డి ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునే వ్యక్తి. ఆయన ఎత్తుకు తగ్గ వెయిట్‌తో ఫిట్‌గా ఉంటారు.  ఆయన రోజువారీ కార్యక్రమాల్లో జిమ్ ( Jim )  చేయడం ఓ భాగం. ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఆయన వ్యాయామాన్ని మర్చిపోరు. అలాగే యోగా కూడా తప్పనిసరిగా చేస్తారు. ఇక ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. డైట్ ఫాలో ( Diet Food ) అవుతారు. ఆయనకు ప్రత్యేకంగా జిమ్ ఇన్‌స్ట్రక్టర్ అలాగే డైటీషియన్ సేవలు అందించేవారు ఉన్నారు. ఆరోగ్యంపై ( Health ) ఇంత జాగ్రత్త తీసుకునే గౌతంరెడ్డికి సహజంగానే ఎలాంటి అనారోగ్యాలు లేవు. 

బిజినెస్ నుంచి పాలిటిక్స్‌కు వచ్చి మేకపాటి గౌతమ్ రెడ్డి సక్సెస్, మీకు ఈ విషయాలు తెలుసా

ఎంతో చురుకుగా ఉండే  గౌతంరెడ్డికి ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోతున్నారు.  ఆయనకు గుండెపోటు రావడానికి కారణాలేమిటో కూడా వైద్య వర్గాలు ( Hospital ) స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి. అయితే రెండు సార్లు కరోనా రావడం వల్ల ఆ ఎఫెక్ట్ ఉండి ఉండవచ్చన్న బలమైన అభిప్రాయం వినిపిస్తోంది. కరోనా వచ్చి తగ్గిపోయిన వారిలో పోస్ట్ కోవిడ్ పరిణామాలతో ( Post Covid Symptoms ) కొంతమంది ఆరోగ్యం సడెన్‌గా క్షీమించడం... గుండెపోటుకు గురవడం వంటి కారణాల వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నట్లుగా వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయనకూ ఇలాంటి సమస్య ఏదైనా వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

ఏది ఏమైనా ఎలాంటి దురలవాట్లు లేని .. పూర్తిగా ఆరోగ్య ప్రమాణాలు పాటించే వ్యక్తి హఠాత్తుగా అనారోగ్యం పాలై ..ప్రాణాలు కోల్పోవడం చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 

Published at : 21 Feb 2022 11:50 AM (IST) Tags: mekapati gautham reddy mekapati Atmakuru MLA AP Minister Gautam Reddy Minister Gautham Reddy Mekapati Gautham Reddy died

సంబంధిత కథనాలు

Mohan babu :  షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు -  ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?

Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?

Krishna District: భార్యను కొరికిన భర్త, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు

Krishna District: భార్యను కొరికిన భర్త, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు

Breaking News Live Telugu Updates:కొత్త సీజేఐగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌

Breaking News Live Telugu Updates:కొత్త సీజేఐగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌

పట్టపగలే డాక్టర్ కిడ్నాప్‌నకు యత్నం- వ్యక్తిని పట్టుకొని చితకబాదిన ప్రజలు

పట్టపగలే డాక్టర్ కిడ్నాప్‌నకు యత్నం- వ్యక్తిని పట్టుకొని చితకబాదిన ప్రజలు

హాస్టళ్ల విద్యార్థలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్

హాస్టళ్ల విద్యార్థలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్

టాప్ స్టోరీస్

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీ ఖరారు, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీ ఖరారు, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

18 సంవత్సరాల కల నెరవేరింది - ఒలంపియాడ్‌లో పతకం అనంతరం ద్రోణవల్లి హారిక

18 సంవత్సరాల కల నెరవేరింది - ఒలంపియాడ్‌లో పతకం అనంతరం ద్రోణవల్లి హారిక

Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి

Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి