Pawan Kalyan : కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు.. ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ డిమాండ్ !

కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పెడతామన్నారు.

FOLLOW US: 

కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని స్పష్టం చేశారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోకపోతే అధికార మార్పిడి తరవాత జనసేన ఆ ప్రక్రియ చేపడుతుందని " దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా"గా పేరు మారుస్తామమని ప్రకటించారు. కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చినప్పుడు.. సంజీవయ్య పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం సమంజసమేనన్నారు.  

Also Read : చంద్రబాబు ఓ గంట కళ్లు మూసుకుంటే చాలు... మేమేంటో వైసీపీకి చూపిస్తాం... పరిటాల సునీత సంచలన కామెంట్స్

ఎందరో మహానుభావుల స్ఫూర్తితో జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు పవన్ కల్యాణ్.  తెలుగు వారు కలిసుండాలని పదవిని తృణప్రాయంగా వదులుకున్న బూర్గుల రామకృష్ణరావు, ఆర్ధిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించిన పీవీ నరసింహారావు లాంటి వ్యక్తులతో పాటు పేదలు, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలబడ్డ దామోదరం సంజీవయ్య లాంటి మహానీయులు స్ఫూర్తితో జనసేన పార్టీని స్థాపించానని పవన్ కల్యాణ్ తెలిపారు.

https://www.youtube.com/watch?v=wfpk-N5Fedo&feature=youtu.be

Also Read: అందులో గవర్నర్ పేరు ఎందుకు వాడారు? పూర్తి బాధ్యత ఎవరిది? సర్కార్‌కు ఏపీ హైకోర్టు ప్రశ్న

సంజీవయ్య గురించి రెండున్నర దశాబ్దాలుగా వింటున్నానని, మేధావులు, విద్యావేత్తలు, ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు, విశ్రాంత అధికారులు సంజీవయ్య విశిష్టతను, పాలన దక్షతను చెబుతున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన కేవలం రెండేళ్లే ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆయన సేవలు వెలకట్టలేనివి, మరువలేనివి అని పవన్ అన్నారు. ఆరు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. అణగారిన వర్గాలకు, వెనకబడిన వర్గాలు, కులవృత్తులు చేసుకొనేవారికీ, పేదలకు పంచారని చెప్పారు. ప్రతి జిల్లాలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేశారన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలని ఉత్తర్వులిచ్చారని చెప్పారు.

Also Read:  చంద్రబాబు వస్తే బాంబులేస్తామని వైఎస్ఆర్‌సీపీ నేత హెచ్చరిక.. కుప్పంలో ఉద్రిక్తత !

ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు…కానీ ఏ ఒక్కరు కూడా సంజీవయ్య ఇంటిని పట్టించుకోలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పేరును ఏ పథకానికి పెట్టలేదన్నారు. ఆయన గొప్పతనం భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే స్మారక భవనం నిర్మించాలని నిర్ణయానికి వచ్చామని జనసేన పార్టీ ద్వారా కోటి రూపాయల నిధులు సమకూర్చి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.  

Also Read : ‘మా’ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోక్యం.. రౌడి షీటర్లతో ఓటర్లను బెదిరించారని ప్రకాష్ రాజ్ ఆరోపణలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 22 Oct 2021 04:58 PM (IST) Tags: pawan kalyan ANDHRA PRADESH janasena Kurnool District Damodaram Sanjeevayya

సంబంధిత కథనాలు

Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

Petrol Price Today 08 August 2022: వాహనదారులకు ఊరట! పలుచోట్ల తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇలా

Petrol Price Today 08 August 2022: వాహనదారులకు ఊరట! పలుచోట్ల తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇలా

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!

Rains in AP Telangana: తీవ్రరూపం దాల్చుతోన్న అల్పపీడనం - భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్

Rains in AP Telangana: తీవ్రరూపం దాల్చుతోన్న అల్పపీడనం - భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్

టాప్ స్టోరీస్

Bimbisara Box Office Collection : 'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నందమూరి కళ్యాణ్ రామ్ భారీగా కొట్టాడుగా!

Bimbisara Box Office Collection : 'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నందమూరి కళ్యాణ్ రామ్ భారీగా కొట్టాడుగా!

Azadi Ka Amrit Mahotsav: ఆహారమే లేని దుస్థితి నుంచి ఆత్మనిర్భరత వరకూ, భారత్‌లో ఈ అద్భుతం ఎలా జరిగింది?

Azadi Ka Amrit Mahotsav: ఆహారమే లేని దుస్థితి నుంచి ఆత్మనిర్భరత వరకూ, భారత్‌లో ఈ అద్భుతం ఎలా జరిగింది?

Rashmika New Movie : అక్కినేని హీరోతో తొలిసారి - మహేష్ దర్శకుడు తీయబోయే సినిమాలో?

Rashmika New Movie : అక్కినేని హీరోతో తొలిసారి - మహేష్ దర్శకుడు తీయబోయే సినిమాలో?

Brain Aneurysm: భారతదేశంలో పెరిగిపోతున్న బ్రెయిన్ అనూరిజం మరణాలు, ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు

Brain Aneurysm: భారతదేశంలో పెరిగిపోతున్న బ్రెయిన్ అనూరిజం మరణాలు, ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు