By: ABP Desam | Updated at : 22 Oct 2021 07:46 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
పరిటాల సునీత(ఫైల్ ఫొటో)
మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షలో పాల్గొన్న ఆమె... ఇప్పటికైనా చంద్రబాబు తీరు మారాలన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక గంటసేపు కళ్లు మూసుకుంటే చాలు తామేంటో చూపిస్తామన్నారు. తన భర్త పరిటాల రవిని చంపినప్పుడు చంద్రబాబు ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని, చంద్రబాబు ఆనాడే కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదన్నారు. టీడీపీ తిరిగి అధికారం చేపట్టాక వైఎస్ఆర్సీపీకి చుక్కలు చూపిస్తామన్నారు.
మాకు బీపీ వస్తోంది...
వైఎస్ఆర్సీపీ అరాచకాలపై ఇప్పటి వరకూ ఓపికతో ఉన్నామన్న పరిటాల సునీత ఇకపై సహించబోమన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కన్నెర్ర చేస్తే దాడులకు పాల్పడుతున్న వాళ్లు ఎవరూ మిగిలేవారు కాదన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన దీక్ష వద్ద మాట్లాడిన సునీత.. వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త పరిటాల రవిని చంపినవాళ్లు రోడ్లపై తిరుగుతున్నా చంద్రబాబుపై ఉన్న గౌరవంతో గొడవ పెట్టుకోకుండా సహనంతో ఉన్నామన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలో వచ్చాక చంద్రబాబు ఓ గంట పాటు కళ్లు మూసుకుంటే చాలు తామేంటో చూపిస్తామన్నారు. మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆరోపించారు. మాకు బీపీ వస్తోంది.. ఏం చేస్తామో త్వరలో చూపిస్తామని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: అందులో గవర్నర్ పేరు ఎందుకు వాడారు? పూర్తి బాధ్యత ఎవరిది? సర్కార్‌కు ఏపీ హైకోర్టు ప్రశ్న
జగన్ కే కాదు గాడ్సేకు అభిమానులున్నారు : చింతమనేని
రాష్ట్రంలో ఇంకా ఎన్నికల జరగాల్సిన స్థానిక సంస్థలకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే వైసీపీకి చెమటలు పట్టిస్తామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈసారి టీడీపీ గెలవకుంటే పార్టీ కార్యాలయం మూసేస్తామని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన మంత్రి పదవి నిలుపుకునేందుకే కొడాలి నాని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారన్నారు. త్వరలోనే ఆయన పదవి పోతుందన్నారు. జగన్‌కే కాదు గాడ్సేకు కూడా అభిమానులున్నారని చింతమనేని అన్నారు. టీడీపీ వాళ్లకు కూడా బీపీ వస్తుందని చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
Also Read: చంద్రబాబు వస్తే బాంబులేస్తామని వైఎస్ఆర్‌సీపీ నేత హెచ్చరిక.. కుప్పంలో ఉద్రిక్తత !
Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు
అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్ తీర్పుపై తీవ్ర విమర్శలు
Breaking News Live Telugu Updates: కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య
AP Telangana Water War: ఆంధ్ర, తెలంగాణ మధ్య నీటి యుద్ధం-పాలమూరు రంగారెడ్డిపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్
Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ ను పొడగింపు- పిటిషన్‌పై తీర్పులు మధ్యాహ్నానికి వాయిదా
Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం
వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా
సిక్కుల ఓటు బ్యాంక్ కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్‌తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?
Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ
జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్
/body>