అన్వేషించండి

Chandrababu: అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

AP CM Chandrababu: మావిగన్ అనేపేరు చెప్పడానికి కూడా తనకు ఇష్టం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతికి చట్టబద్ధత వచ్చిన సందర్భంగా మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Chandrababu Naidu on Amaravati:  ఏపీ రాజధాని అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత లభించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పుష్కర కాలం కిందట తాము పునాది వేసిన అమరావతి కల ఇప్పుడు చట్టరూపం దాల్చడం శుభపరిణామమని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఆయన, పార్లమెంట్‌లో అన్ని పార్టీలు ఈ బిల్లును సమర్థించినా, ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.  దేశంలో అన్ని పార్టీలది ఒక దారైతే, వైసీపీది మరో దారి  అంటూ ఆ పార్టీ వైఖరిని ఎండగట్టారు.
 
తాను తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, నిజానికి సైబరాబాద్, హైటెక్ సిటీల రూపకల్పనతో తెలంగాణ తన  బ్రెయిన్ చైల్డ్  అని చంద్రబాబు గుర్తుచేశారు. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలని కోరుకున్నానని, కానీ రాజధాని కూడా లేకుండా ఏపీని విడదీయడం అన్యాయమని పేర్కొన్నారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో తన అనుభవంతో పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయించానని, అవి కలిపితేనే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని పట్టుబట్టి సాధించుకున్నానని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.  

 
జగన్  ప్రతిపాదించిన  మావిగన్  వంటి వింత పేర్లపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  ఆ పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు. 2014లోనే 9 నగరాల కలయికతో ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని ప్లాన్ చేశామని, కానీ గత పాలకులు కుట్రలతో, నేరాలతో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రైతులను రెచ్చగొట్టినా వారు వెనక్కి తగ్గకుండా భూములు ఇచ్చారని, అమరావతి రైతుల త్యాగం వృధా పోదని భరోసా ఇచ్చారు.
 
ఒకప్పుడు హైదరాబాద్ కంటే అమరావతిలోనే భూముల ధరలు ఎక్కువగా ఉండేవని చంద్రబాబు గుర్తుచేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చుట్టూ భూములు ఇచ్చిన వారు ఎలాగైతే లాభపడ్డారో, భవిష్యత్తులో అమరావతి రైతులు కూడా అదే స్థాయిలో ఆర్థికంగా ఎదుగుతారని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో అపారమైన వ్యవసాయ భూములు ఉన్నాయని, సరైన ప్రణాళికతో అభివృద్ధి చేస్తే హైదరాబాద్‌ను మించిన సంపదను సృష్టించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.   

 
 
గత పాలకుల తీరును ఉద్దేశించి మాట్లాడుతూ..  గతంలో వారిని సైకోలు అనేవారు, ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు  అంటూ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు సంధించారు. వైసీపీ నేతలు గతంలో మంత్రులుగా ఎలా పనిచేశారో అర్థం కావడం లేదని, వారి కుట్రలు ఇక సాగవని హెచ్చరించారు. భగవంతుడు తనకు రెండు గొప్ప అవకాశాలు ఇచ్చాడని, ఒకప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపినట్లే, ఇప్పుడు అమరావతిని అత్యుత్తమ రాజధానిగా నిర్మిస్తానని చంద్రబాబు శపథం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget