అన్వేషించండి

YSRCP Political Plan: ఓ వైపు అమరావతి - మరో వైపు మత మార్పిళ్లు- వైఎస్ఆర్‌సీపీ స్వయం శిక్షలు దేని కోసం!?

YSRCP : వైసీపీ ఏ మాత్రం అవగాహన లేని రాజకీయాలు చేస్తున్న సూచనలు కనిపి్తున్నాయి. కీలక అంశాలపై ఆ పార్టీ నిర్ణయాలు అలాగే ఉంటున్నాయి.

YSRCP politics  : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాజకీయంగా ఆత్మరక్షణలో పడటమే కాకుండా వరుస తప్పిదాలతో సెల్ఫ్ గోల్స్ వేసుకుంటోంది. అమరావతి రాజధాని అంశం మొదలుకొని తాజా మత మార్పిడి వ్యవహారాల వరకు ప్రతి నిర్ణయం పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు సైతం నాయకత్వ ధోరణి చూసి అయోమయానికి గురవుతున్నారు.

 అమరావతి విషయంలో అంతుచిక్కని వ్యూహం

రాజధాని అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత లభిస్తున్న తరుణంలో వైసీపీ అనుసరించిన తీరు ఆ పార్టీకి తీరని నష్టం చేకూర్చింది. ఒకవైపు వికేంద్రీకరణ అంటూనే, మరోవైపు రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ప్రక్రియను అడ్డుకోలేక సభ నుంచి వాకౌట్ చేయడం ద్వారా ఓటమిని అంగీకరించినట్లయింది. ఈ పరిణామం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ పార్టీ పట్ల నమ్మకాన్ని తగ్గించింది. రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరి లేకపోవడం వల్ల అటు ప్రజలు, ఇటు క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

 భూమన కరుణాకర్ రెడ్డి చర్యతో కొత్త చిక్కులు

టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఒక ముస్లిం జంటను హిందూ మతంలోకి మార్చిన ఉదంతం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. హిందూ ఓటు బ్యాంకును ఆకట్టుకోవాలనే తాపత్రయంతో చేసిన ఈ పని వికటించేలా కనిపిస్తోంది. నిజానికి రాష్ట్రంలో క్రైస్తవ మతంలోకి మారిన వారిని తిరిగి హిందూత్వంలోకి తీసుకురావాలనే డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండా, ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ముస్లింలను మత మార్పిడి అంశంలోకి లాగడం చర్చనీయాంశమైంది.

 మైనారిటీ ఓటు బ్యాంకుకు ముప్పు

వైసీపీ ఆవిర్భావం నుండి ముస్లింలు ఆ పార్టీకి బలమైన అండగా నిలుస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి నేరుగా ఒక ముస్లిం కుటుంబాన్ని మతం మార్చి దానిని గొప్పగా ప్రచారం చేసుకోవడం ఆ వర్గంలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. మైనారిటీల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ చర్య వల్ల రాబోయే రోజుల్లో ఆ ఓటు బ్యాంకు పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. సొంత పార్టీ నేతలే ఈ వ్యవహారంపై లోలోపల మదనపడుతున్నారు.

 కార్యకర్తల్లో పెరుగుతున్న నిర్వేదం                               

పార్టీ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల క్షేత్రస్థాయిలో సమాధానం చెప్పుకోలేక వైసీపీ కార్యకర్తలు సతమతమవుతున్నారు. ఒక సమస్యను పరిష్కరించబోయి మరో కొత్త సమస్యను సృష్టించుకోవడం నాయకత్వ లోపంగా కనిపిస్తోంది. హిందూత్వ కార్డు వాడాలా లేక మైనారిటీలను కాపాడుకోవాలా అనే సందిగ్ధంలో పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల వల్ల పార్టీ కేడర్ మానసికంగా కుంగిపోతోంది. రాజకీయాల్లో ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవాలి. కానీ వైసీపీ మాత్రం వరుసగా వివాదాస్పద అంశాలను నెత్తిన వేసుకుంటోంది. అమరావతి విషయంలో ప్రజల నాడిని పట్టుకోలేకపోవడం, మతపరమైన అంశాల్లో అనవసర జోక్యం చేసుకోవడం వల్ల పార్టీ పునాదులు కదులుతున్నాయి. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. 


 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
YSRCP: ఏపీ మున్సిపల్ పోలింగ్.. పలుచోట్ల వైసీపీ నేతల హౌస్ అరెస్ట్! విజయవాడలో గుర్తులు తారుమారు
ఏపీ మున్సిపల్ పోలింగ్.. పలుచోట్ల వైసీపీ నేతల హౌస్ అరెస్ట్! విజయవాడలో గుర్తులు తారుమారు
AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Rice Prices: బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
High Tension in Pulivendula: పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Embed widget