Chandru Chandrababu : కొంత మంది పేటీఎమ్ బ్యాచుల్లా తయారయ్యారు.. జడ్జిలుగా రిటైరై నేరస్తులకు సపోర్ట్ చేస్తారా ? .. చంద్రబాబు విమర్శలు
జగన్‌కు సపోర్ట్ చేస్తూ వ్యవస్థలపై విమర్శలు చేస్తున్న మాజీ న్యాయమూర్తులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైరైన తర్వాత పదవుల కోసం దిగజారుతారా అని ప్రశ్నించారు.

న్యాయవ్యవస్థపైనే కొంత మంది మాజీ న్యాయమూర్తులు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు చేయడాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పు పట్టారు. అమరావతిలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు " ఒక జడ్జి ఎక్కడ్నుంచో ఇక్కడికి వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులు వీళ్లకు పట్టవా?" అని ప్రశ్నించారు. కొందరు పేటీఎం బ్యాచుల్లా తయారయ్యి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో మానవ హక్కులను ఉల్లంఘిస్తూ జరుగుతున్న దాడులు, దౌర్జన్యాల కారణంగా జరుగుతన్న ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ జడ్జీలకు కనపడదా? అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.
Also Read : దేవుడున్నాడు ! టిక్కెట్ల వివాదంపై జగన్ ఊతపదంతోనే కౌంటర్ ఇచ్చిన బాలకృష్ణ !
ఒక నేరస్తుడిగా న్యాయమూర్తులుగా పని చేసి రిటైరైన వాళ్లు సపోర్ట్ చేయవచ్చా అని సూటిగా ప్రశ్నించారు. రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి పదవులు కావాలి.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒకాయన సుప్రీంకోర్టు జడ్జ్‌గా పని చేశారు. ఆయన కుమారుడికి ఏపీలో పదవి తీసుకుని జగన్‌ను పొగుడుతున్నారని తప్పు పట్టారు. తన ప్రసంగంలో చంద్రబాబు ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. కానీ ఇటీవల ఏపీ హైకోర్టుపై జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయనను ఉద్దేశించే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
Also Read : నెల్లూరు టీడీపీలో నాయకత్వ లేమి..కొంప ముంచుతున్నది అదే.. చంద్రబాబు ఫైర్
జై భీమ్ అనే సినిమాతో పబ్లిసిటీ పొందిన జస్టిస్ చంద్రు మానవ హక్కుల పేరుతో నిర్వహించిన సమావేశానికి వచ్చి హైకోర్టు పనితీరును విమర్శించారు. ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని, ప్రభుత్వం శత్రువులు, ప్రత్యర్థులతో కాదు న్యాయవ్యవస్థతో యుద్ధం చేస్తోందని జస్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అమరావతి భూస్కామ్‌లో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని, కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.
ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగానే మారాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా స్పందించారు. అంతేకాదు.. ఈ ఆరోపణలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఖండించారు. రిటైరైన తర్వాత లైమ్‌లైట్‌లోకి రావడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని లైట్స్ ఆఫ్ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. వీటిపైనే చంద్రబాబు స్పందించినట్లుగా తెలుస్తోంది. ఓ సుప్రీంకోర్టు జడ్డిగా పని చేసిన ఆయన కుమారుడు ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఓ కీలక పదవిలో ఉన్నారు. ఆ విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

