అన్వేషించండి

Chandra Babu Naidu: చంద్రబాబుకు బెయిల్ రావడంతో సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. తమకు పార్టీకి లభించిన భారీ ఊరటగా చెప్పుకుంటున్నారు నేతలు.

Chandra Babu Naidu: చంద్రబాబుకు వచ్చింది మధ్యంతర బెయిల్ అయినప్పటికీ టీడీపీ శ్రేణులు భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమకు పార్టీకి లభించిన భారీ ఊరటగా చెప్పుకుంటున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి పరిటాల సునీత ఇంటి వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చి బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. 

పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... ఇక నుంచి వైసీపీ నాయకులకు ఆట మొదలైందని.. చంద్రబాబు ఒకసారి జనం మధ్యలోకి వస్తే వారి పతనం ప్రారంభమవుతుందని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. ఇన్ని రోజులు చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడిన వారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గత 54 రోజులగా ప్రతి ఇంట చంద్రబాబు కోసం ఆవేదన చెందినవారు ఉన్నారని.. ఆయన బయటికి రావడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు పండుగ చేసుకుంటున్నారన్నారు. ఒక వ్యక్తి ప్రజల గుండెల్లో ఈ స్థాయిలో జరగని ముద్ర వేసుకోవడం చాలా అరుదు అని శ్రీరామ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇకనుంచి మరింత ఉత్తేజంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు..

చంద్రబాబు బెయిల్ మంజూరు కావడంతో తిరుమలలో‌ మొక్కులు

తిరుమల శ్రీవారికి టిడిపి నాయకులు  మొక్కులు సమర్పించుకున్నారు.. శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి, కర్పూరం వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. టిడిపి నాయకులు మీడియాతో మాట్లాడుతూ... శ్రీవారి ఆశీస్సులతో చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయిందన్నారు. నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభానికి ముందు శ్రీవారి ఆశీర్వాదం పొందిన నారా భువనేశ్వరి ఒక్కటే‌ కోరుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని, నిజం గెలవాలని ప్రార్ధించారని తెలిపారు. భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టిన తరువాత శ్రీవారి ఆశీస్సులతో చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయ్యిందని, నారా భువనేశ్వరి సంకల్పం నెరవేరుతుందన్నారు.

పూతలపట్టు సమీపంలోని జాతీయ రహదారిపై బాణాసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు తెలుగు తమ్ముళ్లు. జై చంద్రబాబు జై టీడీపీ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. రాజమండ్రి, హిందూపురం ఇలా ప్రతి నియోజకవర్గంలో టిడిపి శ్రేణుల సంబరాలు చేసుకున్నాయి. 

చంద్రబాబు నాయుడు మధ్యంతర బాయిల్  మంజూరు కావడంతో  అంబరాన్నంటిన సంబరాలు. కుప్పం టీడీపీ కార్యాలయం నుంచి కుప్పం బస్టాండ్ సెంటర్ వద్దకు పాదయాత్ర చేసుకుంటూ ర్యాలీ తీశారు నేతలు. బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి ,ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాయి టీడీపీ  శ్రేణులు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద టపాసులు  కాల్చుకుంటూ స్వీట్స్‌  పంచుకున్నారు. నిజం గెలిచింది ..నిజమే గెలిచింది ..  సైకో పోవాలి సైకిల్  రావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. 

హైదరాబాద్‌లో సంబరాలు
హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో టిడిపి శ్రేణుల సంబరాలు చేసుకున్నాయి. ఇకపై టీడీపీకి తిరుగు ఉండదని అభిప్రాయపడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy Political Party: కమ్మ, రెడ్డే CM అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
కమ్మ, రెడ్డే CM అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Vangaveeti Radha: నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
YS Sharmila Daughter Marriage: వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Section 22A Land Controversy: 22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Vijayasai Reddy Political Party: కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
Asia Cup Deadlock: ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
Embed widget