Sharmila birthday: వైఎస్ షర్మిల పుట్టినరోజు - చంద్రబాబు, పవన్ శుభాకాంక్షలు... జగన్ మాత్రం మౌనం!
Sharmila: షర్మిల పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు, పవన్ శుభాకాంక్షలు తెలిపారు . సోదరికి జగన్ విష్ చేయలేదు.

Chandrababu and Pawan wished Sharmila on her birthday: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిసెంబర్ 17, 2025న తన 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సొంత సోదరుడు, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు ఏ శుభాకాంక్షలు తెలియజేయలేదు.
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అధికారిక ఎక్స్ ఖాతా (@ncbn)లో షర్మిలకు శుభాకాంక్షలు చెప్పారు. ఆమెకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థించారు.
Wishing Andhra Pradesh Congress Committee President, Smt. YS Sharmila Garu, a very happy birthday. I pray that she is blessed with good health and a long life. @realyssharmila
— N Chandrababu Naidu (@ncbn) December 17, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా షర్మిల పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీమతి వై.ఎస్.షర్మిల గారికి జన్మదిన శుభాకాంక్షలు
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 17, 2025
ఆంధ్ర ప్రదేశ్ పి.సి.సి. అధ్యక్షురాలు శ్రీమతి వై.ఎస్.షర్మిల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారికి భగవంతుడు చిరాయువునిచ్చి, సుఖ సంతోషాలు అందించాలని కోరుకొంటున్నాను.
- @PawanKalyan @realyssharmila @PIB_India @IPR_AP…
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన షర్మిల, సోదరుడు జగన్‌తో రాజకీయ వివాదాల గత ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఇప్పటికీ ఇద్దరి మధ్య సంబంధాలు సజావుగా లేవు. జగన్ ఇప్పటివరకు షర్మిల పుట్టినరోజుకు సంబంధించి ఏ బహిరంగ శుభాకాంక్షలు తెలియజేయకపోవడం ఈ విభేదాలను మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం చేస్తోంది.YS ఫ్యామిలీలో రాజకీయ విభేదాలు పాతవే. షర్మిల గతంలో YSRCPలో ఉండి, తర్వాత వేరుపడి కాంగ్రెస్‌లో చేరడం, జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం – ఇవన్నీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయి. జగన్ మౌనం ఈ దూరాన్నే ప్రతిబింబిస్తోందని అంటున్నారు.
చంద్రబాబు శుభాకాంక్షలు జగన్‌కు వ్యతిరేకంగా షర్మిలను పరోక్షంగా సపోర్ట్ చేసే సిగ్నల్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ తరపున జగన్‌పై విమర్శలు గుప్పించడం, YSRCPకు కొంత నష్టం కలిగించాయి. ఈ వ్యూహంతోనే వారిద్దరూ షర్మిలను విష్ చేశారని భావిస్తున్నారు. షర్మిల కూడా ఈ రోజు బహిరంగ కార్యక్రమాలు లేవు, సాధారణంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు కాంగ్రెస్ ముఖ్యనేతలు పలువురు శుభాకాంక్షలు చెప్పారు.
Warm birthday wishes to My sister Smt. YS Sharmila Reddy, President of APCC.
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) December 17, 2025
Believing firmly in the path shown by Dr. YS Rajasekhara Reddy (YSR) and working with conviction under the leadership of Shri Rahul Gandhi, your courage, clarity of purpose, and unwavering commitment to… pic.twitter.com/fgcV0sqYkO





















