Chandrababu Comments: ఆస్కార్ ఇవ్వాల్సింది ట్రిపుల్ ఆర్‌కి కాదు ఆయనకే- చంద్రబాబు హాట్ కామెంట్స్!
Chandrababu Comments: ప్రజల రక్తాన్ని తాగే జలగలు, వైసీపీ దొంగలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పును ప్రజలే కట్టాల్సి వస్తుందని చెప్పారు.
Chandrababu Comments: వైసీపీ ప్రభుత్వం చేసిన రూ.10 కోట్ల అప్పులను ఏపీ సీఎం జగన్ కట్టరని, ప్రజలే కట్టుకోవాలని అన్నారు. రూ. లక్షల కోట్ల అప్పు ప్రజల నెత్తిన వేసి.. జగన్ ఓడిపోయాక ఎక్కడికి పారిపోతారో కూడా తెలియదని ఆరోపించారు. అంతే కాకుండా ప్రజలకు రక్తాన్ని తాగే జలగలు... వైసీపీ దొంగలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల ఆస్తి పరుడైన సీఎం.. రాబోయే ఎన్నికల్లో పేదలకు-ధనికులకు యుద్ధం అంటున్నారని.. ఇదెక్కడి విడ్డూరమని చంద్రబాబు అన్నారు. జగన్ అఫిడవిట్ లో రూ.373 కోట్ల ఆస్తిని పేర్కొన్నారని.. దేశంలో అందరూ సీఎంల సంపద కలిపినా ఈయన సంపదలో సగం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాళ్ల పేదవాళ్ల పక్షం అంటే నమ్మడం కష్టమని చెప్పారు. వైసీపీ నేతలు 5, 10 వేల రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకునేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారని వివరించారు. ప్రజలు ఏమాత్రం డబ్బులపై ఆశ చూపించినా ఇక మీ భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తారంటూ స్పష్టం చేశారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా గంజాయి సరఫరా, బ్లేడ్ బ్యాచ్ ల ఆగడాలపైనే చెపుతున్నారు. డీజీపీ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు గంజాయి నివారణ పై కఠిన చర్యలు తీసుకుని కట్టడి చేయాలని కోరుతున్నా. గంజాయితో మన బిడ్డల భవిష్యత్తు నాశనం కాకుండా చూడండి.@APPOLICE100
— N Chandrababu Naidu (@ncbn) February 16, 2023
కాకినాడ జిల్లా జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. గురువారం రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొని వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. రాత్రికి పెద్దాపురం చేరుకున్న చంద్రబాబు బహిరంగ సభలో.. మా నమ్మకం నువ్వే అనే స్టిక్కర్లను ప్రతీ ఇంటికి అతికిస్తారట అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రజల నమ్మకం కాదు మా దరిద్రం నువ్వే జగన్ అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు పోయాయంటూ ఆరోపించారు. ప్రజలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి ఎమ్మెల్యే ద్వారంపూడి ఆఫ్రికాకు అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. పోలీసులు మంచి వాళ్లే అయినప్పటికీ.. వారి మెడపై కత్తి పెట్టి చెడు పనులు చేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్కార్ ఇవ్వాల్సింది ట్రిపుల్ ఆర్‌కు కాదని...కోడి కత్తి కమల్ హాసన్‌కు అని ఎద్దేవా చేశారు చంద్రబాబు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు చంద్రబాబు పర్యటనకు అనూహ్య స్పందన వచ్చింది. కాట్రావులపల్లిలో పంటపొలాలు పరిశీలించిన చంద్రబాబు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత స్కూలు విద్యార్థులు వెళ్తున్న పాఠశాల బస్సు ఎక్కి ముచ్చటించారు. వారిలో ఉత్సాహం నింపారు. పిల్లలంతా ముక్తకంఠంతో మీరే సీఎం కావాలంటూ విద్యార్థులు కోరారు.
విద్యార్థులతో ముచ్చట్లు ఎప్పుడూ ఆసక్తికరమే, ఆహ్లాదకరమే. పెద్దాపురం పర్యటనలో వారితో కొద్దిసేపు గడిపే అవకాశం దక్కింది. వీళ్ళందరికీ ఎన్నో లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను చేరుకునేలా వారికి అవకాశాలు కల్పించడం పాలకుల విధి. మనం వీళ్లకు సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. pic.twitter.com/strOmxGtmn
— N Chandrababu Naidu (@ncbn) February 16, 2023
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సొంత పార్టీలో కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా జగ్గంపేటలో పర్యటిస్తున్న చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ప్రతి ముఫ్ఫై ఇళ్లకు టీడీపీ తరపున ఓ సాధికార సారథిని నియమించాని నిర్ణయించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయించుకోలేకపోయమని కొంత మంది కార్యకర్తలు బాధపడ్డారని.. ఈసారి మాత్రం ప్రత్యేక వ్యవస్థ పెట్టి .. అందరికీ న్యాయం చేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఏ కార్యకర్తకు పని అవసరం అయినా.. పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్‌ఛార్జ్‌లందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేలా వీళ్లు పనిచేస్తారని వివరించారు. సాధికార సారథులుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని చెప్పారు.