అన్వేషించండి

AP Congress : మోదీ, జగన్ కలిసే మోసం చేశారు - తిరుపతిలో ప్రత్యేకహోదా డిక్లరేషన్ చేసిన వైఎస్ షర్మిలారెడ్డి !

AP Congress : ఏపీని చంపింది ప్రధాని మోదీనేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ప్రత్యేకహోదా డిక్లరేషన్ సభలో ప్రసంగించారు.

AP Congress : కేంద్రంలో  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదాపై తొలి సంతకం చేస్తామని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి ప్రకటించారు. గతంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చిన  తిరుపతి తారక రామ గ్రౌండ్ లో  APCC ప్రత్యేక హోదా సాధన సభ నిర్వహించింది.  ప్రత్యేక హోదా పై డిక్లరేషన్ ప్రకటన చేశారు షర్మిలారెడ్డి.  అధికారంలో వచ్చిన వెంటనే హోదాపై రాహుల్ తొలి సంతకం చేస్తామన్నారు.  10 ఏళ్లు ప్రత్యేక హోదా అమలు చేస్తామని.. "ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. హోదా పై మూడు నామాల వానికే మోడీ పంగనామాలు పెట్టాడని విమర్శించారు. 

మోడీ ఒక కేడీ 

పంగనామాలు పెట్టిన మోడీ ఒక KD అని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.  మోడీ అంటే మోసం. మోసం చేసే వాడే మోడీ అని మండిపడ్డారు.  హోదా అడిగితే తల్లిని చంపి బిడ్డను వేరు చేశాడు అంటున్నాడని..   నిజానికి తల్లి లాంటి ఆంధ్రను చంపింది మోడి నేనని మండిపడ్డారు.  హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని మోడీ చంపాడన్నారు.  పోలవరం కట్టకుండా రాష్ట్రాన్ని చంపుతుంది మోడీ నేనని..  విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని చంపింది మోడీ నేనని విమర్శఇంచారు.  ప్రత్యేక హోదా ఇచ్చే వాళ్ళు కావాలా ? హోదా ను తాకట్టు పెట్టే వాళ్ళు కావాలా ?  అని వైఎస్ షర్మిలా రెడ్డి ప్రశ్నించారు.  కోమాలో ఉన్న కాంగ్రెస్ లో నేను చేరింది కేవలం విభజన హామీల సాధన కోసమేనని..  హోదాకోసం అరాట పడే వాళ్ళ మద్య..హోదాను తాకట్టు పెట్టే వారికి మధ్య జరుగుతున్న పోరాటమన్నరాు.  ప్రత్యేక హోదా తో పాటు వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి గడపకు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. 
 
ప్రత్యేక హోదా మన హక్కు 

తిరుపతిలో ఇదే మైదానం వేదికగా మోడీ హామీ ఇచ్చారని.. ఆంధ్ర ప్రజల అవేదన నాకు తెలుసు అన్నాడని..  అధికారం వచ్చిన వెంటనే 10 ఏళ్లు హోదా ఇస్తా అన్నాడన్నారు. ఆంధ్ర రూపు రూపు రేఖలు మారుస్త అన్నాడు కానీ.. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. న్యూ ఢిల్లీ చిన్నబోయే రాజధాని సహకారం అన్నాడు..  ఆంధ్రలో హర్డ్ వేర్ హబ్ అన్నాడు ..ఇంధన యూనివర్సిటీ అన్నాడు ..ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేక పోయాడని విమర్శించారు. ఢిల్లీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా మన హక్కు అని స్పష్టం చేసారు.  హోదా మన హక్కు,పోలవరం మన హక్కు కడప స్టీల్ మన హక్కు, దుగ్గరాజ పట్నం పోర్ట్ మన హక్కు, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ మన హక్కు అన్నారు. 
 
రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి !

హక్కుల సాధనలో బాబు,జగన్ విఫలం అయ్యారని.. ఒక్క హక్కు మీద కూడా పోరాటం చేయలేదన్నారు.  విభజన జరిగి 10 ఏళ్లు దాటింది... ఒక్క హామీ సాధించుకొలేదున్నారు.  15 ఏళ్లు హోదా కావాలని బాబు అడిగారు .. తర్వాత హోదా అడిగితే జైల్లో పెట్టారు.. ఊసరవెల్లి లా రంగులు మార్చారు.. ఈయన రంగులు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు.  జగన్ ఆన్న 25ఎంపీలు కావాలని అడిగారు .. హోదా కోసం దీక్షలు చేశారు  ఎంపీలు రాజీనామా చేస్తే హోదా ఎందుకు రాదో చూద్దాం అన్నాడు   పులిలా గర్జించి అధికారం రాగానే పిల్లి అయ్యాడన్నారు.  మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నాడని మండిప్డారు.  ఒక ముఖ్యమంత్రి 3D గ్రాఫిక్స్ చూపించారు,, ఒక ముఖ్యమంత్రి 3 రాజధానులు అన్నాడు  ఈ పాపం బీజేపీది,బాబుది,జగన్ దన్నారు.  రాష్ట్ర అభివృద్ధి 25 ఏళ్లు వెనక్కి పోవడానికి వీళ్ళే కారణం విభజన హామీలు కాదు..స్థానిక హామీలు కూడా అమలు కానీ పరిస్థితి ఉందన్నారు.  

ఒక్కహామీని నిలబెట్టుకోవాలేదు !

‘‘ఏపీని హార్డ్ వేర్ హబ్‌గా మారుస్తామని, చమురు రిఫైనరీలు ఇస్తామని మోదీ చెప్పారు. వాటిలో ఒక్కమాటా నిలబెట్టుకోలేదు. పదేళ్లుగా ఏపీ ప్రజలను భాజపా మోసం చేసింది. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకు పరిశ్రమలు వస్తాయి.. తద్వారా ఉద్యోగాలు వస్తాయి. మరి ఏపీకి ఏం వచ్చాయి? కనీసం 10 పరిశ్రమలు కూడా రాలేదు. ఉద్యోగాలు దొరక్క యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. యువత లేని రాష్ట్రంగా ఏపీ తయారవుతోంది. మెగా డీఎస్సీ అని దగా చేశారు. జాబ్ క్యాలెండర్‌ అని జగన్‌.. యువతను మోసం చేశారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి ఓట్లు దండుకున్నారే తప్ప.. ఎవరూ పోరాటం చేయలేదు. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి నిర్ణయాలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి’’ అని షర్మిల పిలుపునిచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget