అన్వేషించండి

Breaking News Live Telugu Updates: కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి నాదెండ్ల మనోహర్ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
AP Telangana Breaking News Telugu Live Updates 14 December CM KCR CM Jagan BRS Party office opening Breaking News Live Telugu Updates: కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి నాదెండ్ల మనోహర్ 
ప్రతీకాత్మక చిత్రం

Background

మాండస్ తుపాను ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గిపోగా, త్వరలో మరో అల్ప పీడనం ఏర్పడినట్లుగా వాతావరణ అధికారులు తెలిపారు. మాండస్‌ తుపాను పరిస్థితుల కారణంగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో మంగళవారం (డిసెంబరు 13) అల్పపీడనం ఏర్పడింది. ఇవాల్టికి (డిసెంబరు 14) ఇది తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్లు వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. ఇది మరింత బలపడి ఈ నెల 15 నాటికి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. 

ఇటు బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సమీపంలో కూడా సుమిత్రా జలసంధిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రెండు, మూడు రోజుల్లో పశ్చిమ దిశగా పయనించి శ్రీలంకకు సమీపంలో అల్పపీడనంగా మారొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 

శ్రీలంక సమీపంలోకి వచ్చిన అల్ప పీడనం తమిళనాడు వైపుగా గానీ, శ్రీలంక వైపుగాగానీ, శ్రీలంక కింది భాగం నుంచి కూడా వెళ్లే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తమిళనాడు వైపు ట్రాక్ తీసుకుంటే తప్పకుండా ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది. మాండస్ తుపాను సమయంలో పడిన భారీ వర్షాల తరహాలో వర్షాలు ఉంటాయి. రెండో ట్రాక్ తీసుకుంటే స్వల్ప వర్షాలు పడే అవకాశం ఉంది. మూడో ట్రాక్ తీసుకుంటే దక్షిణ కోస్తాంధ్రలో స్వల్ప వర్షాలు పడే అవకాశం ఉంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు. దీని ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు బలపడి ఈనెల 19వ తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.

ఇక తూర్పుగాలుల ప్రభావంతో మంగళవారం రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రల్లో వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల, రాయలసీమ, ఉత్తర కోస్తాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

నెల్లూరు జిల్లాలో డిసెంబర్ 19 నుంచి 23 తేదీల మధ్య మరో తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు అధికారుల‌కు నిర్దేశించారు. ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మనుబోలు మండలం కాగితాలపూరు, గురువిందపూడి గ్రామాలను సందర్శించి గ్రామ సచివాలయం కార్యాలయ సిబ్బందితో ఆయన మాట్లాడారు.

తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది, నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు/ఆగ్నేయ దిశల నుంచి గాలులు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.

19:51 PM (IST)  •  14 Dec 2022

కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి నాదెండ్ల మనోహర్ 

కాసేపట్లో కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి నాదెండ్ల మనోహర్ 

 కన్నాతో నాదెండ్ల భేటీపై రాజకీయంగా ఆసక్తి .

 సోము వీర్రాజు నాయకత్వంపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న కన్నా 

 జనసేన రోడ్ మ్యాప్ విషయంలో సోము వీర్రాజు తీరును ఖండించిన కన్నా 

ఇద్దరు నేతల భేటీపై రెండు పార్టీల్లోనూ ఆసక్తికరమైన చర్చ .

 కన్నాను నాదెండ్ల మనోహర్ జనసేనలోకి ఆహ్వానించబోతున్నారా? 

రెండు పార్టీల మధ్య గ్యాప్ పై చర్చించుకుంటారా?

17:36 PM (IST)  •  14 Dec 2022

Visakhapatnam: కళాకారుల అధ్యక్షుడు వంకాయల మారుతి ప్రసాద్ ఆత్మహత్య యత్నం

విశాఖ... కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు మెంబర్, కళాకారుల అధ్యక్షుడు వంకాయల మారుతి ప్రసాద్ ఆత్మహత్య యత్నం!!

కారు లో పురుగులు మందు త్రాగిన మారుతి ప్రసాద్!

గాయత్రీ ఆస్పత్రికి తరలింపు.

ఐసీయూ లో చికిత్స అందిస్తున్న వైద్యులు.

ఆస్పత్రికి చేరుకున్న భీమిలి సమన్వయ కర్త ముత్తం శెట్టి మహేష్,కార్యకర్తలు

విచారణ చేపట్టిన పిఎంపాలెం పోలీసులు

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kuppam Chandrababu: కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా  ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ ప్రజలకు అలర్ట్.. ఆంక్షలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక ఆదేశాలు
జూబ్లీహిల్స్‌ ప్రజలకు అలర్ట్.. ఆంక్షలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక ఆదేశాలు
Abhishek Sharma Records: అభి‘షేక్’ ఆడించాడు.. టీ20లలో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా ఘనత.. కోహ్లీ, సూర్య రికార్డ్ బ్రేక్
అభి‘షేక్’ ఆడించాడు.. టీ20లలో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా ఘనత.. కోహ్లీ, సూర్య రికార్డ్ బ్రేక్
Chikiri Chikiri Song: 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ మర్చిపోయేలా చేసిన చికిరి చికిరి
'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ మర్చిపోయేలా చేసిన చికిరి చికిరి
Advertisement

వీడియోలు

Dhruv Jurel Century for India A | సెంచరీలతో చెలరేగిన ధ్రువ్ జురెల్
Abhishek Sharma World Record in T20 | అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డు !
Artificial Rain Failure in Delhi | Cloud Seeding | క్లౌడ్ సీడింగ్ ఫెయిల్యూర్ కి కారణాలు ఇవే ! | ABP Desam
సిరీస్ భారత్‌దే.. వన్డేల పగ టీ20లతో తీర్చుకున్న టీమిండియా
Sanju Samson in IPL 2026 | క్లాసెన్‌ ను విడుదుల చేయనున్న SRH ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kuppam Chandrababu: కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా  ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ ప్రజలకు అలర్ట్.. ఆంక్షలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక ఆదేశాలు
జూబ్లీహిల్స్‌ ప్రజలకు అలర్ట్.. ఆంక్షలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక ఆదేశాలు
Abhishek Sharma Records: అభి‘షేక్’ ఆడించాడు.. టీ20లలో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా ఘనత.. కోహ్లీ, సూర్య రికార్డ్ బ్రేక్
అభి‘షేక్’ ఆడించాడు.. టీ20లలో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా ఘనత.. కోహ్లీ, సూర్య రికార్డ్ బ్రేక్
Chikiri Chikiri Song: 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ మర్చిపోయేలా చేసిన చికిరి చికిరి
'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ మర్చిపోయేలా చేసిన చికిరి చికిరి
Pawan Kalyan Warning: ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాటతీస్తా.. త్వరలో ఆ నలుగురు అరెస్ట్: పవన్ కళ్యాణ్
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాటతీస్తా.. త్వరలో ఆ నలుగురు అరెస్ట్: పవన్ కళ్యాణ్
Congress Politics: బీజేపీ కుట్రలు కాంగ్రెస్ బయటపెట్టినా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: మహేష్ కుమార్ గౌడ్
బీజేపీ కుట్రలు కాంగ్రెస్ బయటపెట్టినా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: మహేష్ కుమార్ గౌడ్
Telugu TV Movies Today: ఈ ఆదివారం (నవంబర్ 09) స్మాల్ స్క్రీన్‌లో సందడి చేసే సినిమాలివే... ఆలస్యమెందుకు, లిస్ట్ చూసేయండి
ఈ ఆదివారం (నవంబర్ 09) స్మాల్ స్క్రీన్‌లో సందడి చేసే సినిమాలివే... ఆలస్యమెందుకు, లిస్ట్ చూసేయండి
Gouri Kishan : హీరోను అలాంటి క్వశ్చన్స్ అడుగుతారా? - బాడీ షేమింగ్‌పై తమిళ హీరోయిన్ రియాక్షన్
హీరోను అలాంటి క్వశ్చన్స్ అడుగుతారా? - బాడీ షేమింగ్‌పై తమిళ హీరోయిన్ రియాక్షన్
Embed widget