Breaking News on 24 September: బీసీ కార్పొరేషన్ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 23న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 23న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
బీసీ కార్పొరేషన్ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్
బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయశాఖ పరిధి నుంచి ఏపీ ప్రభుత్వం తప్పించింది. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు శ్రీలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాల్మియా కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే గురువారం విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్‌ను ఈనెల 30లోగా అమలు చేయాలని ఆదేశించింది.
తెలంగాణలో కొత్తగా 247 కోవిడ్ కేసులు..
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 247 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,64,411కు చేరింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ కారణంగా ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 3,909కి చేరింది. నిన్న ఒక్కరోజే కోవిడ్ బాధితుల్లో 315 మంది కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 6,55,625కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రేపు మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక
ఏపీలో మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక శుక్రవారం జరగనుంది. శుక్రవారం ఉదయం 10 గంటల్లోగా నామినేషన్ల స్వీకరిస్తారు. ఉదయం 10 నుంచి 12 వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. మధ్యాహ్నం 12 గం.కు నామినేషన్లు వేసిన వారి జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటలోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు కోఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక, ప్రమాణస్వీకారం ఉంటుంది. మధ్యాహ్నం 3 నుంచి ఎంపీపీ, ఉపాధ్యక్షుడి ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు
భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. తొలి దశలో త్వరలో 51 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయింది. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.