News
News
X

AP MLC Elections: ఇప్పుడంటారా వైనాట్ 175 అని - కుప్పం కావాలా నాయనా ? పులివెందులే లాగేసుకున్నాం!

కడప, అనంతపురం, కర్నూలు ఉమ్మడి జిల్లాల పశ్చిమ రాయలసీమను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. అందుకే కుప్పం కావాలా నాయనా.. పులివెందుల కూడా వదిలేది లేదు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

FOLLOW US: 
Share:

వైనాట్ 175. సీఎం జగన్ ఇటీవల పదే పదే వల్లె వేస్తున్న స్లోగన్ ఇది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో రకంగా హైలెట్ అవుతోంది. 175కి 175 స్థానాల్లో వైసీపీ గెలవడం అంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో సహా అన్నిస్థానాల్లోనూ వైసీపీ జెండా ఎగురుతుందని అర్థం. కుప్పంపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కుప్పం లాగేసుకుంటామన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. కడప, అనంతపురం, కర్నూలు ఉమ్మడి జిల్లాల పశ్చిమ రాయలసీమను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. అందుకే కుప్పం కావాలా నాయనా.. పులివెందుల కూడా వదిలేది లేదు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

వైనాట్ 175 కాదు. ఇక్కడ జీరో ఔట్ ఆఫ్ 3, ఇదీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మూడు పట్టభద్రుల స్థానాల్లోనూ టీడీపీ గెలవడంతో వైసీపీకి మింగుడు పడటం లేదు. అందులోనూ మూడు స్థానాలు వైసీపీకి ఎంతో ప్రత్యేకం.

తూర్పు రాయలసీమ విషయానికొస్తే.. ఇక్కడ నెల్లూరు జిల్లాలో గతంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు రెబల్ గా మారారనుకోండి, చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి ఏం చెబితే అది నడుస్తుంది, కానీ సీటు మాత్రం టీడీపీకి దక్కింది. ప్రకాశం జిల్లాలో కూడా పక్క పార్టీల నేతల్ని లాగేసుకున్నా ఫలితం మాత్రం తేడా కొట్టింది.

ఉత్తరాంధ్ర విషయానికొస్తే.. రాజధాని వ్యవహారంతో అక్కడ నెగ్గుకు రావచ్చు అనుకున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు పెట్టిన గ్లోబల్ సమ్మిట్ విశాఖలో తమ బలం పెంచుతుందని భావించారు. పట్టభద్రులంతా పొలోమంటూ ఓట్లు వేస్తారని ఆశించారు. కానీ అక్కడ కూడా తేడా కొట్టేసింది. ఉత్తరాంధ్రకు పాలనా రాజధాని తెస్తున్నామని చెప్పినా పట్టభద్రులు నమ్మలేదు, వైసీపీకి ఓటు వేయలేదు.

మూడోది, అతి ముఖ్యమైనది ఉత్తర రాయలసీమ. ఇందులో సీఎం జగన్ సొంత జిల్లా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో కూడా వైసీపీకి మెజార్టీ రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు పట్టభద్రుల నియోజకవర్గ పరిధి చాలా చిన్నది కావొచ్చు, వారిని అందరి ఓటర్లలా అనుకోకపోవచ్చు, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవచ్చు.. అయినా వారు కూడా ఏపీ ప్రజలే కదా, ఏపీలోని ఓటర్లే కదా, రేపు సార్వత్రిక ఎన్నికల్లో వారు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు కదా. మరి అప్పుడు కూడా పట్టభద్రుల ఓట్లు వన్ సైడ్ గా పడితే పరిస్థితి ఏంటి..? ఇద్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

హోరెత్తిన సోషల్ మీడియా.. 
టీడీపీ విజయంతో సోషల్ మీడియా హోరెత్తింది. ముఖ్యంగా సీఎం జగన్ ని టార్గెట్ చేసుకుని ట్రోలింగ్ మొదలు పెట్టింది టీడీపీ బ్యాచ్. కుప్పంని లాగేసుకుంటామని జగన్ అంటున్నారని, పులివెందులలో టీడీపీకి మెజార్టీ వచ్చింది చూసుకోమంటూ ట్రోల్ చేస్తున్నారు టీడీపీ అభిమానులు. ముందు కడప జిల్లాలో జగన్ ప్రజాభిమానం సంపాదించాలని, ఆ తర్వాత కుప్పంవైపు చూడాలని సలహాలిస్తున్నారు.

Published at : 18 Mar 2023 10:36 PM (IST) Tags: YSRCP AP Politics Chandrababu TDP AP MLC Elections mlc elections

సంబంధిత కథనాలు

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Chittoor Budget: కార్పొరేటర్ల అసంతృప్తి, అయినా బడ్జెట్ ఆమోదించిన చిత్తూరు మేయర్ అముద

Chittoor Budget: కార్పొరేటర్ల అసంతృప్తి, అయినా బడ్జెట్ ఆమోదించిన చిత్తూరు మేయర్ అముద

Visakha News : విశాఖలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

Visakha News : విశాఖలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

Anilkumar: వైసీపీ టికెట్ రాకపోయినా ఓకే, సీఎం జగన్ గెటౌట్ అన్నా నేను ఆయన వెంటే!

Anilkumar: వైసీపీ టికెట్ రాకపోయినా ఓకే, సీఎం జగన్ గెటౌట్ అన్నా నేను ఆయన వెంటే!

టాప్ స్టోరీస్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?