అన్వేషించండి

AP High Court: పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకోండి... జడ్జీలపై అనుచిత పోస్టుల కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సామాజిక మాధ్యమాల్లో జడ్జీలపై అనుచిత పోస్టుల కేసుపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచ్ ప్రభాకర్ అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖ సీబీఐ ఎస్పీ శుక్రవారం హైకోర్టు ఎదుట హాజరయ్యారు. పంచ్ ప్రభాకర్ వీడియోలపై యూట్యూబ్‌కు లేఖ రాశామని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ విషయంపై తమకు ఎలాంటి లేఖ రాలేదని యూట్యూబ్ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఫేస్‌బుక్, వాట్సాప్ తరపున ముకుల్ రోహత్గి, కపిల్‌ సిబల్‌ కోర్టులో హాజరయ్యారు. రిజిస్ట్రార్ జనరల్ విజ్ఞప్తి చేసిన వెంటనే పోస్టులు తొలగించాలని స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినికుమార్ తెలిపారు. పంచ్‌ ప్రభాకర్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. పంచ్ ప్రభాకర్‌ను ఎవరో వెనుక నుంచి నడిపిస్తున్నారని స్టాండింగ్ కౌన్సిల్ అనుమానం వ్యక్తం చేసింది. 

Also Read:  చర్రితలో తొలిసారి... 9 మంది సుప్రీం జడ్జిలు ప్రమాణ స్వీకారం... మొత్తం జడ్జిల సంఖ్య ఎంతంటే?

పంచ్ ప్రభాకర్ అరెస్టుకు చర్యలు చేపట్టండి : హైకోర్టు

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలపై లేఖ వస్తే అభ్యంతర పోస్టులను తొలగిస్తామని యూట్యూబ్‌ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ చర్యలు తీసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తు చేపట్టి చాలా రోజులు గడుస్తున్నా అభ్యంతర పోస్టులు ఎందుకు నిలువరించలేకపోతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు పురోగతిపై సీబీఐ డైరెక్టర్‌ ను నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పంచ్‌ ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్‌ను సంప్రదించామని వారి నుంచి అనుమతి దొరకడం లేదని సీబీఐ చెప్పింది. హైకోర్టుపై వ్యాఖ్యలు చేసినా పట్టుకోకపోతే సామాన్యుడి సంగతేంటని ప్రశ్నించింది.

Also Read: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు... ఐదుగురిని అరెస్టు చేసిన సీబీఐ

ఇప్పటికే 11 మంది అరెస్టు

న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ఇటీవలె ఆరుగురు నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకటసత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్‌ సుస్వరం, కిషోర్‌ కుమార్‌ దరిస, సుద్దులూరి అజయ్‌ అమృత్‌లను అరెస్టు చేసినట్టు సీబీఐ తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్‌ 11న జడ్జిలపై అనుచిత పోస్టుల కేసును దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 16 మందిపై 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన సీఐడీ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన అధికారులు గతంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సీబీఐ మరో ఆరుగురిని అరెస్టు చేసింది. 

Also Read: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు.. మరో ఆరుగురిని అరెస్టు చేసిన సీబీఐ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Embed widget