MLC No Bail : జైల్లోనే ఎమ్మెల్సీ అనంతబాబు - బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు !
అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.
MLC No Bail : హత్య కేసులో జైల్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. చార్జిషీటు దాఖలు చేయడంలో అయినందున తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని గతంలో అనంతబాబు పటిషన్ పెట్టుకున్నారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు గతంలోనే తోసిపుచ్చింది. దీంతో అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై విచారమ జరిపిన హైకోర్టు.. గతంలోనే విచారణ జరిపి రిజర్వు చేసింది. ఇవాళ తీర్పును హైకోర్టు వెల్లడించనుంది. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి అనంతబాబు రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కోర్టులో మూడు సార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మధ్యలో కుటుంబసభ్యులు మరణించడంతో కొన్ని రోజులు మధఅయంతర బెయిల్ మీద ఉన్నారు.
అనంతబాబుకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని హతుడి తల్లిదండ్రుల వాదన
అనంతబాబుకు బెయిల్ ఇస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని సుబ్రహ్మణ్యం కుటుంబీకులు కోర్టులో తమకు ఉన్న సమస్యలను వివరించారు. అధికార పార్టీ మద్దతుతో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఆరోపిస్తున్నారు. అదే సమయంలో అనంతబాబు కేసును పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని..కేసును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ.. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారు న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పటికే గవర్నర్, సీఎస్, డీజీపీకి లేఖ రాశారు. ప్రధాని ఈ హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరారు.
హత్య చేసి రోడ్ ప్రమాదంగా చిత్రీకరించి... ఇంటి దగ్గర మృతదేహాన్ని వదిలి వెిళ్లిన ఎమ్మెల్సీ
మే నెల 19న రాత్రి కాకినాడలో వీధి సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎమ్మెల్సీ ప్రయత్నం చేశారు. మే 20న తెల్లవారుజామున ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులోనే సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడంతో అనుమానాలు వచ్చాయి. ఎమ్మెల్సీ తమను బెదిరించారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ తర్వాత అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేయగా.. సుబ్రహ్మణ్యంను హత్య చేసింది తానేనంటూ ప్రాథమికంగా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.
పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని ..నిందితుడి తరపున అనుకూలంగా ఉంటున్నారని విమర్శలు
అయితే పోలీసులు ఈ కేసు విషయంలో ఎలాంటి దర్యాప్తు చేయలేదు. కేవలం ఎమ్మెల్సీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు నమోదు చేశారు. ఇంత వరకూ చార్జిషీటు కూడా దాఖలు చేయలేదు. అదే సమయంలో ఎమ్మెల్సీపై పలు కేసులు ఉన్నప్పటికీ .. ఆయనకు గతంలో నేర చరిత్ర లేదన్ ననివేదికను కోర్టుకు సమర్పించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీకి బెయిల్ నిరాకరించడంతో సుబ్రహ్మణ్యం బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించేలా న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.
జనసేనానికి వైఎస్ఆర్‌సీపీ ఉలిక్కి పడుతోందా ? విశాఖ రావొద్దని ఎందుకంటున్నారు ?