అన్వేషించండి

Sharmila On Jagan : ఏపీ సీఎంను అంత మాట అనేసిన షర్మిల - చిన్నారి రేప్ ఘటనపై ఫైర్ !

Andhra News : ఏపీలో బాలిక రేప్ ఘటన విషయంలో సీఎం జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు, ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవా అని ప్రశ్నించారు.

Sharmila :   ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పదమూడేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన వార్తను కోట్ చేస్తూ.. సీఎం జగన్ పై మండిపడ్డారు.  నా అక్కలూ, నా చెల్లెమ్మలు, నా తల్లులూ, నా అవ్వలూ అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలూ నటించే ముఖ్యమంత్రి గారు అని సంబోధిస్తూ  మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడా, దేశమంతా చెప్పుకుంటోందని మండిపడ్డారు.  లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు, ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో, సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 

 

 

అసలు కేసు ఏమిటంటే ? 

ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి హైస్కూల్‌లో  పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్లేందుకు స్కూల్‌కు వచ్చిన బాలికను గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు నలుగురు యువకులు.  అత్యాచారాన్ని  ఆ బాలుడితో పాటు ఉన్న నలుగురు యువకులు   వీడియో  తీశారు.  బాధిత బాలికను వేధించడం ప్రారంభించారు. ఆ బాలిక ఆకతాయిలకు ఎంతకీ లొంగకపోవడంతో అత్యాచార వీడియోలను వైరల్‌ చేశారు. ఆ వీడియోలు బాధిత బాలిక తల్లి వద్దకు చేరాయి. దీంతో తల్లి బాలికను అడగగా జరిగిందంతా తల్లికి వివరించిందని పోలీసులు తెలిపారు.  

బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు 

 బాలిక తల్లి మండవల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రామచంద్రరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  కైకలూరు రూరల్‌ సిఐ కృష్ణకుమార్‌ వివరాలు సేకరించి అత్యాచారానికి పాల్పడిన బాలుడిని విజయవాడ జువైనల్‌కు తరలించారు. అత్యాచార వీడియోలను చిత్రీకరించి వైరల్‌ చేసిన నలుగురు యువకులను అరెస్టు చేసి కైకలూరు కోర్టుకు తరలించారు.  

లండన్‌లో సీఎం జగన్ 

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ లో ఉన్నారు.  ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత రోజు ఆయన లండన్ వెళ్లారు.  మళ్లీ ఒకటో తేదీన తిరిగి వస్తారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ కనుసన్నల్లోనే పాలన నడుస్తోంది. అయిేతే ఎన్నికలకు సంబంధం లేని వ్యవహారాలు అన్నీ.. కోడ్ తో సంబంధం లేకుండా పరిపాలన చేయవచ్చు.  కానీ ఎన్నికల్లో గెలిస్తే పాలనలో తీరిక లేకుండా ఉండాలి కాబట్టి..  విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉండదని.. ఆయన టూర్ కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
The Raja Saab: రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Embed widget