By: Harish | Updated at : 20 Feb 2023 06:44 PM (IST)
ఎమ్మెల్సీ అభ్యర్థులతో సీఎం జగన్ సమావేశం
ఎన్నికల వ్యూహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర తీసింది. ఎమ్మెల్సీ కోటాలో పదవుల పంపకాల్లో పక్కాగా సామాజిక వర్గాల సమీకరణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. టార్గెట్ 175 లో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యూహత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఎమ్మెల్సీల పదవుల సందడి....
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ చెందిన ఆశావహులకు ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తూ, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి నష్టపోయిన విధేయులకు జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. అంతే కాదు సామాజిక వర్గాల వారీగా కీలకమయిన అంశం కావటంతో, జగన్ ఆచి తూచి వ్యవహరించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మోజార్టీ స్థానాలను బీసీ వర్గాలకు కేటాయించారు. ఇప్పటి వరకు సామాజిక కోణంలో పెద్దల సభలో అడుగుపెట్టని కులాలకు సైతం జగన్ అకాశం ఇచ్చారు. దీంతో ఆయా వర్గాలను పూర్తిగా ఆకట్టుకునేందుకు వీలవుతుందని పార్టీ భావిస్తోంది. టార్గెట్ 175 స్థానాల పైనే గంపెడు ఆశలు పెట్టుకున్న జగన్, ఇక రాబోయే రోజులను పూర్తిగా ఎన్నికల కోణంలో నే చూడాలని భావిస్తోందిని, అందులో భాగంగానే ఏడాది ముందుగానే పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్రంగా చేసుకుందనే ప్రచారం జరుగుతోంది.
2024 ఎన్నికలే టార్గెట్....
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పార్టీ పరంగా ప్రత్యేక గృహ సారథులను రంగంలోకి దింపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్ని వర్గాలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ కీలకమయిన సామాజిక వర్గాలకు పెద్ద పీఠ వేసింది. అందులో భాగంగానే గతంలో ఎన్నడూ ప్రాదాన్యత దక్కని కులాలను వెతికి మరీ ఆయా ఎమ్మెల్సీ స్థానాలను ఆ వర్గాలకు కేటాయించారు సీఎం జగన్.
ఎమ్మెల్సీ అభ్యర్థులతో సీఎం జగన్ సమావేశం....
ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తరవాత సీఎం జగన్ వారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విదంగా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్దులను ఎంపిక చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పార్టీలో మెదటినుండి పని చేస్తున్న వారికి, కులాల వారీగా వారి శ్రమకు గుర్తింపు ఇస్తూ కీలకమయిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 18మందిలో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే ఓసీలకు ఇచ్చామని, అధికంగా 14 స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారికి ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు జగన్.
గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి సాహసం చేయలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటుగా ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని, అదే విధంగా సామాజిక వర్గాల కోణంలోనూ రాజకీయంగా అణచివేతకు గురయిన కులాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆయా సామాజిక వర్గాలకు మరింత ప్రాధాన్యం ఇస్తామన్నారు. బీసీ వర్గాలంటే కేవలం బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదని, బ్యాక్ బోన్ క్లాస్ గా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఆయా వర్గాలకు తెలియచేశామని చెప్పారు. రానున్న రోజులు ఆయా వర్గాలు అన్నీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పూర్తిగా సహకరించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ
Ysrcp Meeting : రేపే ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం, 45 మందిపై సీఎం అసంతృప్తి!
AP SSC Exams: 'పది' పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ - అయితే?
Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో
Breaking News Live Telugu Updates: కారుపై పెట్రోల్ పోసి నిప్పు, లోపల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం
Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల
YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?
SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్ 204
Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్