AP CM Jagan Review: వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలి... వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలపై సీఎం జగన్ సమీక్ష

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉపయోగపడేలా అంతరాయం లేకుండా బ్యాండ్ విడ్త్ తో ఇంటర్నెట్ కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలన్నారు.

FOLLOW US: 

వైఎస్ఆర్ డిజిటల్‌ లైబ్రరీలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష చేశారు. ప్రతి గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీకి అంతరాయం లేకుండా బ్యాండ్‌ విడ్త్‌తో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ వినియోగించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై అధికారులు దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని, వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలని సీఎం జగన్‌ తెలిపారు. డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాల ప్రగతిపై సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. రాష్ట్రంలో 12,979 పంచాయతీల్లో వైఎస్‌ఆర్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మూడు దశల్లో విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటుచేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తొలి విడతలో చేపడుతున్న 4530 విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణ పనులపై సీఎంకు అధికారులు వివరించారు. 

Also Read : హస్తినలో ఏపీ రాజకీయం... టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి వైసీపీ ఫిర్యాదు
జనవరి నాటి తొలిదశ లైబ్రరీలు 
విలేజ్ డిజిటల్ లైబ్రరీల గ్రామీణ యువతకు పోటీ పరీక్షలకు ఉపయోగపడాలని సీఎం జగన్ ఆదేశించారు. లైబ్రరీల నిర్వాహణ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. జనవరి నాటికి తొలిదశలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు తెలియజేశారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించాలని సీఎం జగన్ అన్నారు.

ప్రతి డిజిటల్‌ లైబ్రరీలో డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, సిస్టం ఛైర్లు, ప్లాస్టిక్‌ ఛైర్లు, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ఐరన్‌ రాక్స్, పుస్తకాలు, మ్యాగజైన్‌ల ఏర్పాటు చేయాలని తెలిపారు.  ఉగాది నాటికి ఫేజ్‌-1లో మొదటి దశ డిజిటల్‌ లైబ్రరీలు, డిసెంబరు 2022 నాటికి ఫేజ్‌-2 పూర్తి చేసేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. జూన్‌ 2023 నాటికి మూడో దశ డిజిటల్‌ లైబ్రరీలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో అంతరాయం లేకుండా బ్యాండ్‌ విడ్త్‌తో కూడిన ఇంటర్నెట్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Also Read: పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకోండి... జడ్జీలపై అనుచిత పోస్టుల కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అధికారుల హాజరు
ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది,  ఐటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఎం మధుసూధన్‌ రెడ్డి, ఏపీటీఎస్‌ ఎండీ ఎం.నందకిషోర్, ఇతర అధికారులు హాజరయ్యారు.

Also Read: అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 29 Oct 2021 04:57 PM (IST) Tags: ap govt AP Latest news CM Jagan Review ysr digital libraries Villages internet internet band width

సంబంధిత కథనాలు

Anantapur TDP Kalva :  ఏకతాటిపైకి అనంత టీడీపీ నేతలు - చంద్రబాబు టూర్ తర్వాత మారిన సీన్ !

Anantapur TDP Kalva : ఏకతాటిపైకి అనంత టీడీపీ నేతలు - చంద్రబాబు టూర్ తర్వాత మారిన సీన్ !

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Bhogapuram Air Port: భోగాపురం అంటే పెళ్లి కానేదు- ఊర్ని అల్లకల్లోలం చేసి ఎళ్లిపోమంటే ఎలా? ఎయిర్‌పోర్టు నిర్వాసితుల గోడు

Bhogapuram Air Port: భోగాపురం అంటే పెళ్లి కానేదు- ఊర్ని అల్లకల్లోలం చేసి ఎళ్లిపోమంటే ఎలా? ఎయిర్‌పోర్టు నిర్వాసితుల గోడు

No Change In Konaseema Name : కోనసీమ జిల్లా పేరు మార్చేది లేదన్న ప్రభుత్వం - దాడులపై పరస్పర ఆరోపణలు

No Change In Konaseema Name :  కోనసీమ జిల్లా పేరు మార్చేది లేదన్న ప్రభుత్వం - దాడులపై పరస్పర ఆరోపణలు

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

టాప్ స్టోరీస్

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్

AP Government On CPS: సీపీఎస్‌ అమలు సాధ్యం కాదు- తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం, జీపీఎస్‌కు సహకరించాలని సూచన

AP Government On CPS: సీపీఎస్‌ అమలు సాధ్యం కాదు-  తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం, జీపీఎస్‌కు సహకరించాలని సూచన