AP CM Jagan: పదో తరగతి టాపర్లకు సీఎం జగన్ బంపర్ ఆఫర్, వారికి నేరుగా డబ్బులతో స్పెషల్ గిఫ్ట్!
AP CM Jagan: పదో తరగతి టాపర్లకు ఏపీ సీఎం జగన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా ప్రోత్సహకాల అందజేయబోతున్నారు. 5, 10, 15 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
AP CM Jagan: పదో తరగతి టాపర్లకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. నియోజక వర్గాల్లోని టాపర్లకు ప్రోత్సహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సహకాలను విస్తరించనున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి టాపర్లకే కాకుండా నియోజక వర్గాల వారీగా టాపర్లకూ ప్రోత్సహకాలు ఇవ్వనున్నారు. నియోజకవర్గంలో 1, 2, 3 స్థానాల్లోని విద్యార్థులకు వరుసగా రూ.15, రూ.10, రూ.5 వేలు చొప్పున నగదు ప్రోత్సహకాలు అందించనున్నారు. అలాగే జిల్లా స్థాయిలో టాపర్లకు రూ.50, రూ.30, రూ.10 వేలు ఇవ్వనున్నారు. రాష్ట్ర స్థాయిలో టాప్ వచ్చిన ముగ్గురికి లక్ష రూపాయలు, 75 వేలు, 50 వేలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. పదో తరగతి, ఇంటర్ ఫలితాలే అందుకు నిదర్శనం. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను సన్మానించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.
టెన్త్ , ఇంటర్ టాపర్లకు ప్రభుత్వ సత్కారం ...
— Botcha Satyanarayana (@BotchaBSN) May 18, 2023
నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 23న టాప్ 3 సాధించిన వారికి పతకం మరియు సర్టిఫికెట్ తో సన్మానం.
జిల్లా స్థాయిలో ఈ నెల 27న టాప్3 సాధించిన వారికి
50వేలు , 30వేలు ,10వేలు .
రాష్ట్ర స్థాయిలో ఈ నెల 31న టాప్3 సాధించిన వారికి
1లక్ష ,…
నియోజక వర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులను అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కరించనున్నారు. జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, జీటీడబ్ల్యూ ఆశ్రమ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. మార్కుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్ లో 2 వేల 831 మంది విద్యార్థులను సత్కరించనున్నట్లు మంత్రి తెలిపారు.