అన్వేషించండి

AP Cabinet : 16వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ - పూర్తి స్థాయి బడ్జెట్ పై నిర్ణయం తీసుకునే అవకాశం

Andhra : ఏపీ కేబినెట్ భేటీ పదహారో తేదీన జరగనుంది. గతంలో ఓటాన్ అకౌంట్ పెట్టినందున పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. ఈ విషయంపై చర్చించనున్నారు.

AP Cabinet meeting will be held on the 16th  :  ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఈ నెల పదహారో తేదీన సమావేశం కానుంది.  సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌లో హాలులో చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరుగుంది.  ఈ సమావేశంలో కీలక విషయాలపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంత్రి రాష్ట్ర బడ్జెట్ పై చర్చలు జరపనున్నారు. ఎన్నికల కారణంగా గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడినందున పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కానీ ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. 

పథకాలకు నిధుల సమీకరణ పెద్ద సవాల్                        

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలకు పెద్ద ఎత్తున నిధులు అవసరం.  ప్రభుత్వం ఏర్పాటయ్యి నెలరోజులు కావస్తుండటంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనే భేటీలో ర్చించే అవకాశం ఉంది. అలాగే అన్నక్యాంటీన్లు ఇతర పథకాల అమలుపై చర్చించి విధి విధానాలు ఖరారు చేయనున్నారు.  అలాగే కేంద్రం కూడా పూర్తి స్థాయి బడ్దెట్‌ను నెలాఖరులో ప్రవేశ పెట్టనుంది. 

మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, సీఎం రేవంత్ రెడ్డి నజరానా

కేంద్రం నుంచి భారీ  సాయం ఆశిస్తున్న చంద్రబాబు                                  

ఇటీవల చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో  ఆంధ్రప్రదేశ్ కు రూ. లక్ష కోట్ల వరకూ ఆర్థిక సాయం కావాలని వినతి పత్రం ఇచ్చారు.  ఆర్థిక అవసరాలు తీరడానికి ప్రస్తుతం ఉన్న నిబంధల కన్నా జీడీపీలో అదనంగా అర శాతం అప్పు తీసుకునే అవకాశాన్ని కల్పించాలని చంద్రబాబు కోరారు. అలాగే రాజధాని అమరావతి కోసం ఐదు వేలకోట్లు అడిగారు. తాజా బడ్జెట్‌లో పదిహేనను వందల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అాలాగే పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి ఆర్థిక సాయం అందుతున్నప్పటికీ కేంద్రం నుంచి బడ్జెట్ సపోర్టు పదిహేను వందలకోట్లు కావాలని అడిగినట్లుగా తెలుస్తోంది. అలాగే కేంద్ర దేశవ్యాప్తంగా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో భాగంగా ఏపీకి వెయ్యి కోట్లు కేటాయించాలని కోరారు.

తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు కలకలం - టీడీపీని బలోపేతం చేస్తారా ? కాంగ్రెస్‌ను బలహీనం చేస్తారా ?

కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపును బట్టి పూర్తి బడ్జెట్                      

కేంద్రం బడ్దెట్‌లో ఏపీకి కేటాయించే నిధుల ఆధారంగా తదుపరి ప్రణాళికలు వేసుకోవాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మరో మూడు నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగేలా ఆర్డినెన్స్ తీసుకు వచ్చి.. తర్వాత సెప్టెంబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు.         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BMC Election Results 2026: బీఎంసీలో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
BMC లో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
Surya Kumar Yadav - Khushi Mukherjee: క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌పై కామెంట్స్... ఖుషి ముఖర్జీపై ఎఫ్ఐఆర్ - 100 కోట్ల పరువు నష్టం దావా కేస్
క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌పై కామెంట్స్... ఖుషి ముఖర్జీపై ఎఫ్ఐఆర్ - 100 కోట్ల పరువు నష్టం దావా కేస్
BMC Election Results 2026: ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే
ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే
Viral Video: 6 అడుగుల బ్లాక్ కోబ్రాతో గేమ్స్.. చికిత్సకు ముందే పాము కాటుతో వ్యక్తి మృతి- వీడియో వైరల్
6 అడుగుల బ్లాక్ కోబ్రాతో గేమ్స్.. చికిత్సకు ముందే పాము కాటుతో వ్యక్తి మృతి- వీడియో వైరల్

వీడియోలు

Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam
Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BMC Election Results 2026: బీఎంసీలో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
BMC లో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
Surya Kumar Yadav - Khushi Mukherjee: క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌పై కామెంట్స్... ఖుషి ముఖర్జీపై ఎఫ్ఐఆర్ - 100 కోట్ల పరువు నష్టం దావా కేస్
క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌పై కామెంట్స్... ఖుషి ముఖర్జీపై ఎఫ్ఐఆర్ - 100 కోట్ల పరువు నష్టం దావా కేస్
BMC Election Results 2026: ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే
ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే
Viral Video: 6 అడుగుల బ్లాక్ కోబ్రాతో గేమ్స్.. చికిత్సకు ముందే పాము కాటుతో వ్యక్తి మృతి- వీడియో వైరల్
6 అడుగుల బ్లాక్ కోబ్రాతో గేమ్స్.. చికిత్సకు ముందే పాము కాటుతో వ్యక్తి మృతి- వీడియో వైరల్
మొబైల్స్ లో మునిగి చదువుకు దూరమవుతున్న పిల్లల్ని దార్లోకి తీసుకురావాలంటే ఇలా చేయండి!
మొబైల్స్ లో మునిగి చదువుకు దూరమవుతున్న పిల్లల్ని దార్లోకి తీసుకురావాలంటే ఇలా చేయండి!
SlumDog 33 Temple Road: పూరి - సేతుపతి సినిమాకు 'స్లమ్‌డాగ్' టైటిల్ ఫిక్స్... ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారోచ్
పూరి - సేతుపతి సినిమాకు 'స్లమ్‌డాగ్' టైటిల్ ఫిక్స్... ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారోచ్
Adilabad Politics: నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
Ind vs Nz: భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం.. వారి బ్యాటింగ్ అద్భుతం: బ్రేస్‌వెల్
భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం.. వారి బ్యాటింగ్ అద్భుతం: బ్రేస్‌వెల్
Embed widget