అన్వేషించండి

Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, సీఎం రేవంత్ రెడ్డి నజరానా

Mohammed Siraj meets Telangana CM Revanth Reddy | తెలంగాణ ప్రభుత్వం క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ప్రభుత్వం ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులను సీఎం ఆదేశించారు.

Government Job and Plot for Mohammed Siraj: టీమిండియా క్రికెటర్, తెలంగాణకు చెందిన మహమ్మద్ సిరాజ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను తగిన రీతిలో తెలంగాణ ప్రభుత్వం గౌరవించింది. సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఇంటి స్థలం సైతం కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటికి అనువైన స్థలాన్ని గుర్తించాలన్నారు. 

టీ20 వరల్డ్ కప్ నెగ్గిన అనంతరం ముంబైలో విజయోత్సవాలు పూర్తి చేసుకుని సిరాజ్ హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో మహమ్మద్ సిరాజ్ మంగళవారం (జులై 9న) తెలంగాణ ముఖ్యమమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ నివాసంలో సిరాజ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశాడు. టీమిండియా టీ20 ప్రపంచ కప్ సాధించినందుకు హైదరాబాదీ సిరాజ్ ను రేవంత్ రెడ్డి అభినందించి, శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా పేసర్ సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డికి టీమిండియా జెర్సీని  బహుకరించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

భవిష్యత్‌లో మహమ్మద్ సిరాజ్ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అదే విధంగా భారత క్రికెట్ జట్టుకు మరిన్ని సేవలు అందిస్తూ మంచి పేరు తేవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి 17 ఏళ్ల తరువాత పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. వరల్డ్ కప్ నెగ్గిన తరువాత వాతావరణం అనుకూలించక క్రికెటర్లు రెండు రోజులు అక్కడే ఉండిపోయారు. భారత ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఆటగాళ్లు, సిబ్బందిని ఇక్కడికి రప్పించింది. మొదట ప్రధాని మోదీ భారత ఆటగాళ్లను కలిశారు. వారి ఆటతీరును మెచ్చుకున్నారు. దేశం గర్వించేలా చేశారని ప్రశంసల జల్లులు కురిపించారు.

Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, సీఎం రేవంత్ రెడ్డి నజరానా

అనంతరం ముంబైలో టీ20 వరల్డ్ కప్ హీరోలను ఘనంగా సన్మానించారు. ఆ తరువాత ఆటగాళ్లు వారి స్వస్థలాలకు వెళ్లగా.. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు హైదరాబాద్‌కు చేరుకున్న సందర్భంగా ఘనస్వాగతం లభించింది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకోగా, సిరాజ్ సేవల్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అతడికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించి గౌరవించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Embed widget