Nepal Updates: నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ఏపీ వాసులు - ప్రభుత్వానికి జేజేలు
Nepal Andhra Tourists: నేపాల్లో పర్యాటక ప్రాంతాలకు వెళ్లి అల్లర్లలో చిక్కుకున్న ఆంధ్రుల్ని ప్రభుత్వం విజయవంతంగా వెనక్కి తీసుకు వచ్చింది. లోకేష్ రెండు రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించారు.

Andhra residents stranded in Nepal reach AP: నేపాల్ లో అంతర్గత సంక్షోభం కారణంగా పర్యాటకులు ఇరుక్కుపోయారు. అక్కడ ఉండిపోయిన వారిలో తెలుగు వాళ్లు కూడా ఉన్నారు. వారందరి గురించి తెలుసుకున్న నారా లోకేష్.. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉండి రెండు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించారు. ముందుగా నేపాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రులతో కమ్యూనికేట్ అయి.. వారందర్నీ ఖాఠ్మాండూ విమానాశ్రయానికి చేర్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా విశాఖకు తీసుకు వచ్చారు.
144 మందితో విమానం బయలుదేరుతున్న వీడియోను నారా లోకేష్ షేర్ చేసారు. ఇండిగో విమానం విశాఖపట్నం , తిరుపతికి బయలుదేరింది. 36 గంటల కృషితో వారి ముఖాల్లో కనిపించిన ఆనందం విలువైనదిగా చేసిందన్నారు. టీమ్ RTGS, టీమ్ NRT , టీమ్ AP భవన్‌లకు వారి అవిశ్రాంత 24x7 మద్దతు ఇచ్చారని అభినందించారు.
And that’s liftoff! ✈️ Our special Indigo flight from Kathmandu with 144 Telugu brothers and sisters is now en route to Vizag & Tirupati. It’s been a long 36 hours, but the joy and relief on their faces makes it all worth it! I’m thankful to Team RTGS, Team NRT & Team AP Bhawan… pic.twitter.com/Ofgfn4gso2
— Lokesh Nara (@naralokesh) September 11, 2025
ప్రభుత్వ యంత్రాంగం అంతా సమష్టిగా పని చేసి.. నారా లోకేష్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు మానిటర్ చేసి తెలుగు వారందర్నీ సురక్షితంగా ఏపీకి తీసుకు రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అభినందించారు.
Delighted to note that the rescue of stranded Telugu people from #Nepal has begun successfully, reuniting them with their families. I thank the Union Government for their prompt and swift assistance in this regard. I also commend Hon’ble IT Minister @naralokesh Garu, Hon’ble Home… pic.twitter.com/5MR0jHqwTh
— N Chandrababu Naidu (@ncbn) September 11, 2025
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం... 2 రోజుల పాటు ప్రతి గంట, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ... ఒక వైపు బాధితులతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెబుతూ... మరోవైపు కేంద్రంతో మాట్లాడుతూ... ఇంకోవైపు నుంచి ప్రత్యేక విమానం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ... లోకేష్ గారు చేసిన ఒక యజ్ఞం విజయవంతమైందన్న ప్రశంసలు లభిస్తున్నాయి. [
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం... 2 రోజుల పాటు ప్రతి గంట, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ... ఒక వైపు బాధితులతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెబుతూ... మరోవైపు కేంద్రంతో మాట్లాడుతూ... ఇంకోవైపు నుంచి ప్రత్యేక విమానం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ... లోకేష్ గారు చేసిన ఒక యజ్ఞం… pic.twitter.com/RG5ICNPYpB
— Telugu Desam Party (@JaiTDP) September 11, 2025
ఉత్తరాంధ్ర, కోస్తాలకు చెందిన పర్యాటకుల్ని విశాఖలో.. నలభై మందికిపైగా పర్యాటకుల్ని తిరుపతిలో దించారు.





















