AP Schools Reopen: ఏపీలో బడి గంట మోగింది... కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తెరుచుకున్న విద్యా సంస్థలు

ఏపీలో పాఠశాలలు తెరుచుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ విద్యా సంస్థలు అన్ని సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు పునః ప్రారంభం అయ్యాయి.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ లో బడిగంట మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలు తెరవచ్చని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.  విద్యాసంస్థల్లో ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మించకూడదు. తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే విద్యార్థులు తరగతులకు హాజరుకావాలి.

రోజు విడిచి రోజు తరగతులు

విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. విద్యాసంస్థల లోపల, బయట పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చేయాలి. ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతిరోజూ పాఠశాలలకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశించింది. తరగతుల్లో పిల్లల సంఖ్య అధికంగా ఉంటే రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. 

Also Read: APSWREIS Recruitment 2021: రెండ్రోజుల్లో ముగియనున్న గడువు.. ఈ పోస్టులకు అప్లయ్ చేశారా?

ఆ విద్యార్థులకు ఐసోలేషన్ గది

పాఠశాలల్లోకి ప్రవేశించే ముందు విద్యా్ర్థులకు థర్మల్‌ స్కానింగ్‌ చేస్తారు. విద్యార్థులలో ఎవరికైనా జలుబు, జ్వరం, కొవిడ్ లక్షణాలు ఉంటే... వారిని ఇళ్లకు తిరిగి పంపి కరోనా నిర్థారణ పరీక్షలు చేయించనున్నారు. కోవిడ్‌ లక్షణాలున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించనున్నారు. ఇళ్లలో కొవిడ్ బాధితులు, వృద్ధులు, రోగులు ఉన్న విద్యార్థులు పాఠశాలలకు రాకుండా ఇంటి వద్దనే ఉండాలని విద్యాశాఖ సూచించింది. అనారోగ్యంతో ఉండే విద్యార్థులు స్కూళ్లకు రాకుండా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి ప్రతి వారం కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించాలని సూచించింది. వారిలో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ ఉంటే మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు చేయించాలని అన్ని స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు పంపింది.

Also Read: BSF Recruitment 2021: మీరు టెన్త్ పూర్తి చేసి ఉంటే రూ.69,100 జీతం వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయండిలా

కోవిడ్ జాగ్రత్తలపై ఓ పీరియడ్

తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఏర్పాట్లు చేయించాలని విద్యాశాఖ సూచించింది. మధ్యాహ్న భోజనం సమయంలోనూ అందరికీ ఒకేసారి కాకుండా విడివిడిగా భోజన ఏర్పాట్లు చేయాలని తెలిపింది. స్కూలు నుంచి విద్యార్థులు వెళ్లే సమయంలోనూ అందర్నీ ఒకేసారి కాకుండా 10 నిమిషాల వ్యవధిలో బయటకు పంపమని సూచించింది. స్కూలుకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు భౌతిక దూరం ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు తెలిపింది. స్కూలులో కోవిడ్‌ నిబంధనలపై ఒక పీరియడ్ తీసుకోవాలని చెప్పింది. విద్యార్థులు గుంపులుగా లేకుండా చూసుకోవాలని తెలిపింది. స్కూలు అసెంబ్లీ, గేమ్స్ వంటివి పూర్తిగా రద్దు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.    

Also Read: AP Schools: ఆ పిల్లల చదువులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... అదే స్కూళ్లల్లోనే కొనసాగించాలని ఆదేశాలు

Published at : 16 Aug 2021 10:08 AM (IST) Tags: abp latest news AP Latest news AP today news AP schools Reopen Schools reopen AP Schools

సంబంధిత కథనాలు

AP PCC Chief Kiran :  ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి ! కాంగ్రెస్‌కు జరిగే మేలెంత ?

AP PCC Chief Kiran : ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి ! కాంగ్రెస్‌కు జరిగే మేలెంత ?

Guntur News : బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న గుజరాత్ కిలేడీలు, వాహనాల తాళాలు లాక్కొని బ్లాక్ మెయిల్!

Guntur News : బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న గుజరాత్ కిలేడీలు,  వాహనాల తాళాలు లాక్కొని బ్లాక్ మెయిల్!

Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

East Godavari News : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్

East Godavari News :  ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్

Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త

Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే